క్రూర త్రిగ్రహ యోగం: నేడు ఈ రాశులవారికి ధననష్టం.. జాగ్రత్త!!
నేడు తులా రాశిలో క్రూర త్రి గ్రహ యోగం ఏర్పడబోతోంది. అక్టోబర్ 18వ తేదీన సూర్యుడు తన బలహీనమైన రాశి అయిన తులారాశిలో సంచరించే సమయంలో మధ్యాహ్నం 1.18 నిమిషాలకు తులారాశిలో కేతువు కుజుడు ఉండటం వల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. ఈ త్రిగ్రహ యోగం 12 రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది.
ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఇది చాలా కష్టమైన సమయంగా కనిపిస్తుంది. వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. నేడు క్రూర్ త్రిగ్రహ యోగం వల్ల ఇబ్బంది పడే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకున్నాం. అక్టోబర్ 18వ తేదీన సూర్యుడు తులా రాశిలో సంచరించే సమయంలో సూర్యుడు తులా రాశి యొక్క ఆరోహణ గృహం లో ఉంటాడు. అప్పటికే తులా రాశిలో కుజుడు, కేతువులు సూర్యుడితో త్రి గ్రహ యోగాన్ని ఏర్పరుస్తారు.

మూడు గ్రహాల కలయిక మంచిది కాదు. ఇది చాలా క్రూరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని క్రూర్ త్రి గ్రహ యోగం అని పిలుస్తారు. తులారాశిలో ఈ మూడు గ్రహాలు కలిసి ఉండడం ఏ రకంగానూ మంచిది కాదు. క్రూర్ త్రిగ్రహ యోగం వల్ల మేషరాశి, వృషభరాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి జాతకుల జీవితాలలో ప్రతికూలమైన ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో ఊహించని ధన నష్టం కూడా జరుగుతుంది.
వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేసే సమయంలో వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాదు వారు ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఎలాంటి కొత్త పనులు చెయ్యకూడదు.కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటుంది.
ఏ పని చేసినా సరే ఫలితాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఇక తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయిన వారికి ఈ సమయం మరింత కష్టాలను కలిగిస్తుంది. కోర్టుల చుట్టూ తిరగాల్సి కూడా రావచ్చు. ఈ సమయంలో విపరీతమైన ఆర్థిక నష్టాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి నేడు ఈ నాలుగు రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications