12నెలల తర్వాత సంవత్సరాంతంలో లక్ష్మీనారయణ రాజయోగంతో వీరికి జాక్ పాట్!
వేద జ్యోతిష్య శాస్త్రంలో 2025 సంవత్సరం ముగిసే సమయానికి కొన్ని ముఖ్య రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ధనుస్సురాశిలో శుక్ర సంచారం జరుగుతుంది. ఆపై డిసెంబరు 29వ తేదీన బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 12 నెలల తర్వాత ధనుస్సు రాశిలో శుక్రుడు మరియు బుధుడు సంయోగం చెందటం వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది.
లక్ష్మీనారాయణ రాజయోగంతో అదృష్టవంతులు అయ్యే రాశులు
ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి బంగారం లాంటి భవిష్యత్తును ప్రసాదిస్తుంది. ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశులవారు అదృష్ట జాతకులు అవుతున్నారు. వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మరి ఈ సంవత్సరంలో లక్ష్మీనారాయణ రాజయోగంతో అదృష్టవంతులు అయ్యే రాశుల గురించి తెలుసుకుందాం.

ధనుస్సు రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ రాజయోగం మీ సంచార జాతకంలో లగ్న స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయంలో ధనుస్సు రాశి వారి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వివాహితులు అద్భుతమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి .చాలాకాలంగా ఒకే కంపెనీలో పని చేస్తున్న వారు శుభవార్తలు వింటారు.
కన్యారాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులకు అదృష్టం. కన్యా రాశిలో భౌతిక సుఖాల గృహంలో బుధ శుక్రుల సంయోగం జరగడం వల్ల ఈ సమయంలో మీరు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేస్తారు. రాజకీయాలలో ఉన్న వారికి పదోన్నతులు వస్తాయి. జీతం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. తల్లితో సంబంధాలు బలంగా ఉంటాయి.
వృశ్చిక రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. ఊహించని ఆర్థిక ప్రయోజనాలను చూస్తారు. విదేశాలలో వ్యాపారం చేసే వారికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పాత అప్పుల నుండి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications