Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lunar eclipse2022: రేపే చంద్రగ్రహణం.. ఈ 5రాశుల వారికి ప్రతికూల ప్రభావం; తస్మాత్ జాగ్రత్త!!

ఈ సంవత్సరం రెండవ చివరి చంద్రగ్రహణం నవంబరు 8వ తేదీన, రేపు ఏర్పడబోతుంది. ఈసారి చంద్రగ్రహణం మధ్యాహ్నం 2 గంటల 38 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల 29 నిమిషాలకు ముగుస్తుంది. అయితే మధ్యాహ్న సమయాల్లో చంద్రగ్రహణం రావడంతో, అది కూడా భారత దేశంలో పాక్షిక చంద్ర గ్రహణం ఉండడంతో చంద్ర గ్రహణాన్ని మనం చూసే అవకాశం లేదు. అయినప్పటికీ చంద్రగ్రహణం ప్రభావం మనపై ఉంటుందని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

కొన్ని రాశులపై చంద్రగ్రహణం తీవ్ర ప్రభావం

కొన్ని రాశులపై చంద్రగ్రహణం తీవ్ర ప్రభావం

ముఖ్యంగా గర్భిణీలు గ్రహణం సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ చంద్రగ్రహణం కొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అని, వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇక రేపు ఏర్పడనున్న చంద్రగ్రహణం ఏ ఏ రాశుల పై ప్రభావం చూపిస్తుంది. ఏ ఏ రాశుల వారికి నష్టం చేస్తుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేష రాశి వారిపై చంద్రగ్రహణం ప్రభావం

మేష రాశి వారిపై చంద్రగ్రహణం ప్రభావం


నవంబరు 8వ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం మేష రాశి వారిపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ చంద్రగ్రహణం కారణంగా మేష రాశి వారికి అనేక ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార పరంగా కూడా తీవ్రమైన నష్టాలను చవిచూడాల్సి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం కారణంగా ఈ రాశివారికి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన మానసిక సమస్యలు, రోజువారీ వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాలకు సంబంధించిన ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. వైవాహిక బంధం లో కూడా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారు ఈ చెడు ప్రభావం నుండి ఉపశమనానికి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు

వృషభ రాశి వారు జాగ్రత్త

వృషభ రాశి వారు జాగ్రత్త

ఇక రేపు ఏర్పడబోయే చంద్రగ్రహణం వృషభ రాశి వారు కూడా కాస్త ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశి పై చంద్రగ్రహణం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. నిద్రకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

వృశ్చిక రాశి వారు బీ కేర్ ఫుల్

వృశ్చిక రాశి వారు బీ కేర్ ఫుల్

ఇక చంద్రగ్రహణం కారణంగా వృశ్చిక రాశి వారు తీవ్ర ఇబ్బందుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వృశ్చిక రాశి వారి మానసిక స్థితి ఇబ్బందికరంగా మారుతుంది. ఆరోగ్యం పట్ల వారు జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం. ఏదో చెడు జరిగినట్టు తీవ్రంగా వృశ్చిక రాశి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కోవడంలో ఒత్తిడికి గురవుతారు. ఈ క్రమంలో వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనారోగ్యం బారిన పడతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 తులా రాశి వారు అప్రమత్తంగా ఉండాల్సిందే

తులా రాశి వారు అప్రమత్తంగా ఉండాల్సిందే

ఈ సారి చంద్ర గ్రహణం తులా రాశి వారి పైన కూడా ప్రభావం చూపిస్తుంది. తులా రాశి వారికి ఈ చంద్రగ్రహణం అశుభసూచకంగా చెబుతున్నారు. వృత్తి వ్యాపారాలలో చిరాకులు, ఉద్యోగాలలో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసిక అనారోగ్యం కలుగుతుంది. వివాహం, ప్రేమ వంటి బంధాలలో టెన్షన్ కలుగుతుంది. చేసిన శ్రమకు తగిన ఫలితం రాదు. శ్రమకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడతాయి. కడుపు మరియు కాళ్లకు సంబంధించిన అనారోగ్య సమస్యలు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి తులా రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కన్యా రాసి వారు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త

కన్యా రాసి వారు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త

ఇక కన్యా రాశి పైన కూడా చంద్రగ్రహణం తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఉద్యోగం చేసే వారికి రకరకాల తీవ్ర సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరగడం, మానసిక ప్రశాంతత లోపించడం కనిపిస్తుంది. రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రాశి వారు జీవితంలో చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ఈ రాశి వారు తస్మాత్ జాగ్రత్త.


disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+