Lunar eclipse2023: మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం.. ఈ రాశులవారికి కష్టాలు; జాగ్రత్త!!
మరికొన్ని గంటల్లో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28 మరియు అక్టోబర్ 29 తేదీల మధ్య అర్ధరాత్రి 1.06 నిమిషాల నుండి 2.24 నిమిషాల వరకు ఏర్పడనుంది. భారతదేశంలో ఈసారి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈసారి ఏర్పడే చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం కావడంతో సూతక కాలాన్ని పాటించాలని చెబుతున్నారు. ఇది కొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది.
ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనే విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మరికొన్ని గంటల్లో ఏర్పడనున్న రాహు గ్రస్త చంద్రగ్రహణం వల్ల వృషభ రాశి, కర్కాటక రాశి, మీన రాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కన్యా రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

ఈ చంద్రగ్రహణం శారద పూర్ణిమతో కలిసిన చంద్రగ్రహణం కావడంతో ప్రతికూలమైన ప్రభావాలను కలిగిస్తుందని, ఈ చంద్ర గ్రహణ ప్రభావం అన్ని రాశుల వారిపై ఉన్నప్పటికీ, పైన పేర్కొన్న రాశుల వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఈ గ్రహణం వీరికి అదృష్టాన్ని ఇవ్వదని, గ్రహణ సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని చెబుతున్నారు.
ఈ చంద్రగ్రహణం వల్ల వృషభ రాశి, కర్కాటక రాశి, మీన రాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కన్యా రాశుల వారికి అనారోగ్య బాధలు, ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమయంలో వీరు ప్రయాణాలు చేయడం మంచిది కాదని, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ రాశుల వారికి ఆదాయంతో పోలిస్తే ఖర్చులు పెరుగుతాయని, మీరు చేయాలనుకున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయని చెబుతున్నారు.
వైవాహిక జీవితం విషయంలో భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉందని, ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ సమయం ఊహించని కష్టాలను కలిగిస్తుంది కాబట్టి, కాస్త, ఓపికతో సహనంతో పని చేసుకోవలసి ఉంటుందని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications