వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంపూర్ణ చంద్రగ్రహణం నేడే: ఏం చేయాలి, ఏం చేయకూడదు?

By Pratap
|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

ఈ రోజు 31 తేది బుధవారం రోజున పుష్యమి,ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటకరాశిలో సాయంత్రం 5:18 మొదలుకొని 8:41 వరకు కర్కాటక,సింహ లగ్నాలలో రాహూగస్త సంపూర్ణ చంద్ర గ్రహణము సంభవించనున్నది.భారత కాలమానం ప్రకారం సాయత్రం ప్రారంభం అవుతుంది.

ఈ గ్రహణ ఫలితాలు వివిధ రాశులలో జన్మించిన వారిపై ఎలా ఉంటాయి?

"త్రిషడ్దశాయేషుపగతం నరాణాం
శుభప్రదం స్యాద్గ్రహణం రవీంద్వోః
ద్విసప్తనందేషు మధ్యమంస్యాత్
శేషేష్వనిష్టం కథితం మునీంద్రైః"

అనగా జన్మరాశినుండి 3,6,10,11 రాశులలో గ్రహణం శుభం. 2,7,9 లయందు మధ్యమం. మిగలిన రాశులయందు అనగా 1,4,5,8,12 అశుభం. ప్రస్తుతం కర్కటకరాశి యందు గ్రహణం కావున కర్కటక, ధను,మీన, మేష,సింహ రాశులవారికి అశుభ ఫలితాలను సూచిస్తున్నాయి కాబట్టి.

Lunar eclipse: its impact and the rules involved

ఈ దానాలు చేయాలి....

గోదుమలు,బియ్యం,మినుములు మరియు చంద్ర బింబదానం చేసుకోవాలని శాస్త్రం తెలియజేస్తోంది.

బింబదానం అంటే వెండి చంద్రుడు, వెండి రాహువు,
బంగారు/వెండి సూర్యుడిని రాగిపాత్రలో ఆవునేయి వేసి, వీటిని అందులో ముంచి ఆయా గ్రహాలకు పూజచేసి దోషాన్ని సంకల్పంలో చెప్పి అనంతరం వాటినన్నింటిని వస్త్ర దక్షిణాదిసహితంగా దానం చేయాలి. గ్రహణానంతరం ఎంత త్వరగా ఈ దానం చేసుకుంటే అంత మంచిది.

వివిధ రాశులవారిపై ఫలితాలు జ్యోతిష గ్రంథాలలో ఇలా ఉన్నాయి.

రాశులవారిపై ఈ ప్రభావాలు

1. మేషం : శరీరపీడ 2. వృషభం : ధనలాభం
3. మిథునం : నష్టం
4. కర్కాటకం : తీవ్రగాయాలు,నష్టాలు
5. సింహం : హాని
6. కన్య : లాభం
7. తుల : సుఖం
8. వృశ్చికం : గౌరవభంగం
9. ధనుస్సు : తీవ్ర అనారోగ్యం
10. మకరం : భార్యకు కష్టం (లేదా) స్త్రీల మూలంగా ఇబ్బందులు.
11.కుంభం : సౌఖ్యమ్
12. మీనం : దిగులు.

అందుకే చెప్పారు

మన మహర్షులు ఈ ఫలితాలను మనలను భయపెట్టే ఉద్దేశ్యంతో తెలుపలేదు. ప్రారబ్ధాన్ని దైవపూజ,దానము ఇత్యాది పురుషప్రయత్నా లద్వారా నివారణ లేక ఉపశమనం పొందవచ్చన్న గొప్ప సత్యాన్ని అందివ్వటమే వారి ఆశయం. కనుక ఆ విషయాన్ని మీ ముందు ఉంచటం జరిగింది.

గ్రహణ సమయంలో ఇష్ట దైవానికి సంబంధించిన స్తోత్రాలను లేదా నామ జపాన్ని చేయడం విశేష ఫలదాయకం. మిగిలిన వారు కూడా గ్రహణ సమయం లో వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు

ఈ పనులు చేయకూడదు...

ఇక గ్రహణ పుణ్యకాలంలో చేయకూడనివి.
1. నిద్ర, భోజనం, స్త్రీ సహవాసము కూడవు.
2. గ్రహణానికి ముందు వండిన పదార్థాలు గ్రహణానంతరం తినకూడదు.
అయితే, గ్రహణానికి ముందు ఉన్న నూనె పదార్థాలు, గంజి, మజ్జిగ, నూనె/నెయ్యి తో వండిన పదార్థాలపై దర్భతో ఉంచితే అవి తర్వాత వాడుకోవడానికి పనికి వస్తాయి. అలాగే బాల, వృద్ధ, గర్భిణులు మధ్యాహ్నం గం.3-00 వరకు ఆహారం తీసికొనవచ్చును.

గ్రహణ సమయాలు ఇవీ....

సాయంత్రం. 5:18 చంద్రగ్రహణ ప్రారంభ కాలం
సా. 6:22 సంపూర్ణ స్థాయిలోకి గ్రహణం
రాత్రి. 7:38 గ్రహణం సంపూర్ణ స్థాయి నుండి విడుపు దశ వైపు
రాత్రి. 8:41 గ్రహణ అంత్యకాలము ( గ్రహణ మోక్షం )
గ్రహణం ప్రారంభం నుండి వదిలే వరకు ఉన్న మొత్తం గ్రహణ సమయం 3 గంటల 23 నిమిషాలు.
సంపూర్ణ సూర్య బింబ దర్షణ కాలం మొత్తం "76"నిమిషాలు.

ఇలా చేస్తే శుభం

ఈ గ్రహణం భారతదేశంతో సహ ఆసియా ఖండం, అమెరికా ,యూరప్ ఈశాన్యప్రాంతం.ఆస్ట్రేలియా,న్యూజిలాండ్,పసిఫిక్ మహాసముద్రం,హిందూ మహాసముద్రం ప్రాంతములందు చంద్ర గ్రహణం కనబడుతుంది.గ్రహణం గ్రహణమే కావునా ద్వాదశ రాశులవారు గ్రహణ నియమ నిబంధనలు పాటిస్తే శుభం కలుగుతుంది.

గ్రహణ నిబంధనలు ఇవీ

ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని గర్భిని స్త్రీలు ప్రత్యేక్షంగా చూడ కూడదు,టివిలలో చూస్తే దోషం లేదు. ప్రశాంతగా ఉంటూ మనస్సులో భవంతున్ని ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిది.గర్భినిలు కదలకుండా పడుకోవాలి అనే అవాస్తవాన్ని నమ్మకండి.ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చును,ఇందులో ఎలాంటి సందేహాలు పడకూడదు.గ్రహణ సమయంలో మల,మూత్ర విసర్జనలు చెయకూడదు అనే అపోహలు వద్దు,అది వాస్తవం కాదు .నిలువ ఉంచే పచ్చల్లు,పిండి వంటలు,ముఖ్యమైన ఎక్కువరోజులు నిలువ ఉంచే ఆహార పదార్ధాలపై గరిక పోసలను వేయాలి.దీనివలన ఆహార పదార్ధాలకు గ్రహణ ప్రభావము పడకుండా కాపాడబడతాయి.

ఆహార పానీయ నియమాలు ఇవీ

అన్ని వయస్సులవారు గ్రహణానికి మూడు గంటల ముందుగానే ఘన పదార్ధాలు,భోజనాలు పూర్తి చేసుకోవాలి. ద్రవ పదార్ధాలు గ్రహణము పట్టే సమయానికి గంటన్నర ముందు వరకు పాలు,జ్యూసులు మొదలగునవి తీసుకోవచ్చును.గ్రహణము పూర్తి అయిన తర్వాత తలస్నానంచేసి ఫ్రెష్ గా వంట చేసుకొని తినాలి.ఉదయం చేసిన అన్నం కూరలు మొదలగునవి తినుటకు పనికి రాదు.కారణము ఏమనగా గ్రహణ సమయంలో నిలువఉన్న ఆహర పధార్ధాలు విషస్వభావాన్ని కలిగి ఉంటాయి.అవి తింటే వెంటనే వాటి స్వభావాన్ని చూపకపోయినా నిధానంగా శరీరానికి హాని కలిగిస్తాయి కాబట్టి తినకూడదు అని శాస్త్రాలు,పెద్దలు చెబుతుంటారు.

ఇలా చేస్తే ఫలితం

గ్రహణ సమయంలో శాస్త్రీయ పద్దతిని ఆచరించాలి అనుకునేవారు వారి శారీరక శక్తి , జిజ్ఞాస ఉన్నవారు గ్రహణము పట్టుటకు ముందు,తర్వాత పట్టు,విడుపు స్నానాలు చేసి ధ్యానం (జపాలు) భవవత్ స్మరణతో ఉండగలిగితే మాములు సమయములో చేసిన ధ్యాన ఫలితంకన్న రెట్టింపు స్తాయిలో ఫలితం లభిస్తుంది. ముసలివారు, చిన్నపిల్లల్లు, గర్భినిలు, అనారోగ్యముతో ఉన్నావారు చేయకూడదు.చేయనిచో ఏమో అవుతుందనే భయపడకండి.

అతి ముఖ్యమైన విషయం

గ్రహణం పూర్తి అయిన తరవాత ఇంట్లో దేవున్ని శుద్ధి చేసుకోవాలి,విగ్రహాలు,యంత్రాలు ఉన్నవారు పంచామృతంతో ప్రోక్షణ చేసుకోవాలి.జంద్యం(గాయత్రి)వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు తప్పక మార్చుకోవాలి.ఇంటిముందు,వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాలలు,కొబ్బరి కాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్తవి శాస్త్రోకంగా కూశ్మాండా(గుమ్మడికాయ)పూజ విధి విధానంగా చేయించి గుమ్మంపై కట్టుకుంటే మంచి శుభఫలితాలను ఇస్తాయి. మీ మీ శక్తి కొలది గ్రహణానంతరం గ్రహదోష నివారణ జపాలు,పూజలు చేయించుకున్న తర్వత ఆవునకు తోటకూర,బెల్లం తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేయాలి,పెదలకు ఏదేని ఆహర,వస్త్ర,వస్తు రూపంలో ధానం చేయగలిగితే మీకున్న అరిష్టాలు,గ్రహభాదలు కొంతవరకు నివారణ కలిగి భగవత్ అనుగ్రహం కలుగుతుంది జైశ్రీమన్నారాయణ.

English summary
Astrologer explained the rules and regulations of Lunar eclipse taking place today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X