మరో 24 గంటల్లో ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల శుభ యోగం అంతా 12 రాశి చక్రాల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈసారి దుర్గాష్టమి (మహాష్టమి) రోజు అరుదైన గ్రహాల కలయిక జరగబోతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. చైత్ర నవరాత్రులలో శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలోకి 30 సంవత్సరాల తర్వాత ప్రవేశించింది. అదే సమయంలో బృహస్పతి తన రాశి చక్రం మీన రాశిలో 12 సంవత్సరాల తర్వాత ఉండబోతున్నాడు. దీనివల్ల కొన్ని గ్రహాల స్థానం కూడా ప్రత్యేకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. మహాష్టమి రోజున హన్స్, మానవీయ, కేదార్, మహాభాగ్య వంటి గొప్ప రాజయోగాల కలయిక ఏర్పడుతోంది. మహాష్టమి 29వ తేదీన వస్తోంది. దీనివల్ల ఏయే రాశులవారికి బాగుంటుందో చూద్దాం.
మీన రాశి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం మీన రాశి వారికి ఊహించని రీతిలో లాభించబోతోంది. సమాజంలో గౌరవం లభించడంతోపాటు ఉద్యోగాలు చేసేవారు ఉన్నతస్థానాలకు చేరుకుంటారు. రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారికి ఎక్కువ లాభం ఉంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభంతోపాటు విదేశీ ప్రయాణాలు కూడా లాభిస్తాయి.

మిథన రాశి:
చైత్ర అష్టమి రోజు రాజయోగాలు ఏర్పడనున్నాయి. మిథున రాశి వారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. వివాహం కానివారికి వివాహం కుదురుతుంది. వృత్తిలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. వీరి కుటుంబ జీవితం బాగుంటుంది. వ్యాపారవేత్తలకు పెద్దస్థాయిలో ఒప్పందాలు వస్తాయి.
కర్కాటక రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారికి వృత్తి జీవితంలో పలు ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు లభించడంతోపాటు సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆహ్లదకరంగా సాగుతుంది. ఆర్థిక స్థతి మెరుగుపడటంతోపాటు కొత్త ఉద్యోగాలకు కూడా ఇది మంచి సమయం.

కన్యా రాశి:
గ్రహాల మహా సంయోగం కన్యారాశివారికి అద్భుతమైన ఫలితాలను అందించబోతోంది. ఉద్యోగం లేనివారికి కొత్తగా ఉద్యోగం రావడంతోపాటు ప్రస్తుతం ఉద్యోగులుగా ఉన్నవారికి మరిన్ని శుభఫలితాలుంటాయి. వ్యాపారస్తులు ప్రయాణం చేస్తారు. వారికి ఈ ప్రయాణం వల్ల మంచి ఫలితాలు లభించబోతున్నాయి. అంతేకాదు.. ఈ సమయం పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైనది. విద్యార్థులు గొప్ప గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications