మహా శివరాత్రి నాడు ఈ పరిహారాలతో సంపదల వర్షం, సంతోషం!

ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటాము. హిందూమతంలో మహా శివరాత్రికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రతీ సంవత్సరం మాఘ మాసంలో వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈ సంవత్సరం మహా శివరాత్రి చాలా విశిష్టతను సంతరించుకుంది.

మహాశివరాత్రి నాడు వజ్రయోగం
మహాశివరాత్రి పర్వదినాన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని, లింగోద్భవం జరిగిందని చెబుతారు. మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని పూజించడంతో పాటు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి నాడు వజ్రయోగం ఏర్పడుతుంది ఈ యోగం కారణంగా అనేక శుభ ఫలితాలు రాబోతున్నాయి.

Maha Shivratri 2025 Rain of wealth and happiness with these remedies on Maha Shivratri with these special remedies we will get money health and prosperity

శివరాత్రి నాడు కొన్ని ప్రత్యేక నివారణలు
ఇక ఈ ప్రత్యేక యోగం ఏర్పడిన సమయంలో శివపురాణం ప్రకారం కొన్ని ప్రత్యేక నివారణలు పాటిస్తే తరగని ఐశ్వర్యం కలుగుతుందని, శ్రేయస్సు జరుగుతుందని చెబుతారు. ఇక ఆ ప్రత్యేక నివారణలు గురించి మనం తెలుసుకుందాం. మహా శివరాత్రి పర్వదినాన శివానుగ్రహం కావాలంటే కోరిన కోరికలు తీరాలంటే శివుడికి రేగుపండ్లను, ప్లమ్ పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులందరికీ మరణ భయం పోతుందని ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు.

మహా శివరాత్రి నాడు ఈ పరిహారాలతో శుభం
మహాశివరాత్రి పర్వదినాన్ని కోరిన కోరికలు తీరాలంటే ఏడు నల్ల మిరియాలను, నల్ల నువ్వులు, ఒక ఎండుమిరపకాయను శివునికి సమర్పిస్తే శివుడు సంతోషిస్తాడని పండితులు చెబుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన మారేడు చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి, శివుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే వారికి సంతోషం, శ్రేయస్సు కలుగుతాయని చెబుతున్నారు. మహాశివరాత్రి నాడు శివునికి ఏడు ఉమ్మెత్త పువ్వులను సమర్పిస్తే శివలింగానికి భస్మాన్ని సమర్పిస్తే మంచి జరుగుతుందని చెబుతారు.

ఈ పరిహారాలతో శివ కటాక్షం
11, 21 లేదా 101 మారేడు దళాలను తీసుకొని ఓం నమశ్శివాయ మంత్రాన్ని చదువుతూ శివుడికి సమర్పిస్తే శివుడు సంతృప్తి చెంది కోరిన కోరికలను తీరుస్తాడని చెబుతున్నారు. మహాశివరాత్రి పర్వ దినాన ఉపవాసం చేసి, జాగారం చేసి ఎవరైతే ఈ పరిహారాలను పాటిస్తారో వారికి శివుడి యొక్క కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+