ఈ రాశులకు మూడు రోజుల్లో మహాలక్ష్మీ రాజయోగం
జ్యోతిష్యం ప్రకారం నవంబరు 20వ తేదీ నుంచి ప్రత్యేకమైన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఆరోజు చంద్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించడంతోపాటు కుజుడితో సంయోగం చెందుతాడు. దీనివల్ల ఏర్పడే మహాలక్ష్మీ రాజయోగం కొన్ని రాశులవారికి మానిసికంగా ఎంతో ప్రశాంతతను, సంపదను కల్పిస్తుంది. ఏయే రాశులవారికి ఈ యోగం వల్ల లాభం కలుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం.
కర్కాటక రాశి
ఉద్యోగస్థులకు లాభదాయకంగా ఉంటుంది. శారీరకంగా మంచి బలాన్ని సంతరించుకుంటారు. సమస్యలన్నీ తొలగిపోతాయి. సమాజంలో గౌరవం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మానసికంగా మంచి ఆరోగ్యంతో ఉంటారు. వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి. జీవితంలో అభివృద్ధి అనేది వీరు ఊహించనిరీతిలో జరుగుతుంది.

మీన రాశి
కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. శనిదేవుడి ప్రభావంతో వీరు కొత్త ప్రణాళికలు రచించుకొని ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బలపడతారు. అనుకున్న పనుల్లో చాలా సులువుగా విజయం సాధిస్తారు. అదనపు ఆదాయ వనరుల కోసం వెతికే అవకాశం లేకుండా అవే తటస్థపడతాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
వృశ్చిక రాశి
కెరీర్ చాలా బాగుంటుంది. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా మంచి మార్పులు చోటుచేసుకుంటాయి. పెండింగ్ పనులన్నింటినీ ఈ సమయంలో సులభంగా పూర్తిచేస్తారు. ఆత్మవిశ్వాసాన్ని క్రీడీకరించుకుంటారు. విద్యార్థులు చదువులో రాణించడంతోపాటు అవార్డులు పొందుతారు. చేస్తున్న పనుల నుంచి ప్రస్తుతం మంచి లాభాలు వస్తాయి. జీవితంలో మంచి విజయాలు సాధించడానికి ఇది అనువైన సమయం.












Click it and Unblock the Notifications