మహాశివరాత్రి రోజు గ్రహాల అద్భుత సంయోగం.. పరమేశ్వరుడి అనుగ్రహంతో సంపద పెరిగే రాశులు వీరే
మహా శివరాత్రి అంటేనే అద్భుత పర్వదినం. ప్రపంచ మానవాళి, సమస్త జీవకోటికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరుగుతుంది. అర్థరాత్రి సమయంలో లింగోద్భవం ఉంటుంది. అటువంటి పండగ రోజు మూడు ప్రధానమైన గ్రహాలు సంచారం చేస్తున్నాయి. కుజుడు, చంద్రుడు, బుధుడు తమ స్థానాలను మారుస్తాయి. బుధుడు పూర్వాభాద్ర నక్షత్రంలోకి, చంద్రుడు ధనిష్ట నక్షత్రంలోకి, కుజుడు కూడా ఇదే నక్షత్రంలోకి సంచారం చేస్తారు. ఈ ప్రభావం వల్ల ఆర్థికంగా కలిసివచ్చే రాశుల వివరాలను తెలుసుకుందాం.
ధనస్సు రాశి
వ్యాపారాలు లాభసాటిగా మారతాయి. అప్పుల బాధ నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు పదోన్నతులున్నాయి. బంగారంతోపాటు వెండి కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్థులకు కొత్త బాధ్యతలు అందుతాయి.

మకర రాశి
నిలిచిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. వ్యాపారాలను విస్తరిస్తారు. కొత్త వ్యాపారాల ప్రారంభానికి ఇది మంచి తరుణం. అలాగే పురోగతి కూడా ఉంటుంది. న్యాయ సంబంధిత కేసుల్లో కోర్టుల నుంచి అనుకూలంగా తీర్పులు వస్తాయి. ఆస్తికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.
మేష రాశి
పెట్టుబడులు పెట్టడంవల్ల జీవితంలో బాగా కలిసివస్తుంది. వీరికి ఆకస్మికంగా ధనలాభం ఉంది. ఆర్థికంగా గతంలోకంటే ఇప్పుడు బలవంతులవుతారు. కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. అందరి నుంచి మద్దతు లభిస్తుంది. ఏ పనిలోనైనా విజయాన్ని అందుకుంటారు. వ్యాపారస్తులకు చాలా బాగుంది. కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.
మిథున రాశి
వీరి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో చాలా సులువుగా పూర్తవుతాయి. జీవితంలో అనుకున్నది సాధిస్తారు. అంతేకాకుండా సమస్యలన్నీ చాలా సింపుల్ గా, మీకు తెలియకుండానే పరిష్కారమవుతాయి. ఈ రాశివారికి సంపాదన విపరీతంగా పెరుగుతుంది. పెద్దల నుంచి ఆస్తి కలిసివస్తుంది.












Click it and Unblock the Notifications