త్వరలో వీరికి మహారాజయోగం .. నా మాటే శాసనం అంటున్న బుధుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడు బుధుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నవంబర్ 11వ తేదీన ఉదయం ఆరు గంటల 29 నిమిషాలకు బుధ గ్రహం జేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. అత్యంత వేగంగా ప్రయాణం చేసే గ్రహాలలో బుధ గ్రహం ఒకటి.
బుధ నక్షత్ర సంచారం
అన్ని రాశుల మాదిరిగానే బుధుడు తన రాశిని తన నక్షత్రాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాడు. బుధుడు కమ్యూనికేషన్ ను పెంచే గ్రహం. ఇక బుధుడి జ్యేష్ఠ నక్షత్ర సంచారం మూడు రాశుల వారికి అదృష్టాన్ని చేకూరుస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి జాతకులు బుధుడి నక్షత్ర సంచారం కారణంగా కమ్యూనికేషన్ సామర్ధ్యాలను మెరుగుపరుచుకుంటారు. మరింత నిర్ణయాత్మకంగా వారు వ్యవహరిస్తారు. బుధ గ్రహ సంచారం కారణంగా మిధున రాశి వారి వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. పనిచేసే చోట గౌరవం లభిస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి.
కన్యా రాశి
కన్యా రాశి వారు సహజంగానే కష్టపడే స్వభావం ఉండేవారు. బుధ నక్షత్ర సంచారం కారణంగా కన్యా రాశి వారి కష్టానికి తగిన ఫలితం వస్తుంది. కన్యా రాశి వారి ఆదాయం ఈ సమయంలో పెరుగుతుంది. నూతన వ్యాపార అవకాశాలు వస్తాయి. పనిచేసే చోట గౌరవ మర్యాదలు లభిస్తాయి. సహ ఉద్యోగులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు.
తులారాశి
తులారాశి జాతకులు చాలా స్నేహపూర్వకంగానూ, ఆకర్షణీయంగాను ఉంటారు. బుధ గ్రహ సంచారం కారణంగా తులారాశి వారి పై ప్రజల నమ్మకం పెరుగుతుంది. తులా రాశి వారికి ఈ ప్రభావం జీవితంలోని ప్రతిరంగం పైన ఉంటుంది. ఉద్యోగస్తుల పనిపట్ల ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తారు. నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ఇది మంచి సమయం. కుటుంబ సంబంధాలు చాలా దృఢంగా ఉంటాయి. పెళ్ళికాని వారికి వివాహాలు జరిగే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications