రెండు రోజుల్లో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతున్నారు!
వేద జ్యోతిష శాస్త్రంలో ప్రతీ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నవ గ్రహాలు వివిధ రాశులలో వివిధ నక్షత్రాలలో నిర్దిష్ట కాలం ప్రకారం సంచారం చేస్తాయి. గ్రహాల సంచారం, వాటి వివిధ దశల కారణంగా అతి ముఖ్యమైన అనేక సంఘటనలు జరుగుతాయి. గ్రహాలు వివిధ రాశుల్లోకి సంచరించటం అనేక ఖగోళ మార్పులకు కారణం అవుతుంది. .
కుంభరాశిలో బుధ ఉదయం
ఇక ఫిబ్రవరి 26వ తేదీన శనిపాలించే రాశి అయిన కుంభరాశిలో బుధుడి ఉదయం జరుగుతుంది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుండగా మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. కుంభరాశిలో బుధోదయం కారణంగా సానుకూల ఫలితాలను పొందే రాశులను గురించి తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి వారికి బుధుడు ఉదయం కారణంగా శుభ సమయం ప్రారంభమవుతుంది. మేషరాశి జాతకులు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో బాగా పురోగతిని సాధిస్తారు. ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. చాలా విషయాల్లో మేష రాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది.
సింహరాశి
సింహరాశి వారికి బుధుడి ఉదయం కారణంగా కలిసి వస్తుంది.వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా జీవిస్తారు. తోబుట్టువులు, బంధువుల నుంచి సింహ రాశి వారికి మద్దతు లభిస్తుంది. ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి సానుకూల ఫలితం ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కుంభరాశిలో బుధుడు ఉదయించడం కారణంగా శుభాలు జరుగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆస్తులు కొనాలనుకునే వారికి ఈ సమయం సానుకూల సమయం. ఈ సమయంలో వీరికి ధన ప్రయోజనాలు కలుగుతాయి. వర్తక, వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాలలో ప్రశంసలు దక్కుతాయి. ఇది కుంభరాశి వారికి అదృష్ట సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications