సరిగ్గా 4 రోజులు ఆగండి.. ఈ రాశులకు అఖండ ధనయోగం
దీపావళి పండగ గురించి తెలియనివారే ఉండరు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా, నరకాసురుడిని సత్యభామ వధించిన ఆనందంలో అందరూ టపాసులు కాల్చుకోవడంతోపాటు కొన్ని ప్రాంతాల్లో రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేస్తారు. జ్యోతిష్యం ప్రకారం దీపావళి రోజు అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. గ్రహాలకు యువరాజైనటువంటి బుధుడు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించడంవల్ల మూడు రాశులవారి జీవితం పూర్తిగా మారిపోతోంది. వారు పట్టుకుందల్లా బంగారమే కానుంది. పూర్తిగా లాభపడే రాశులవారు ఎవరనే విషయాలను తెలుసుకుందాం.
కన్యారాశి
వీరికి పట్టిందల్లా అదృష్టమే కానుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలోనే పూర్తవుతాయి. ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించడంతోపాటు వారు ఎప్పటినుంచో విదేశాల్లో చదవాలనుకుంటున్న కోరిక కూడా నెరవేరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. విజయాలు సులువుగా సాధిస్తారు. అడుగడుగునా ఏ పని తలపెట్టినా బంగారమే అవుతుంది.

తులారాశి
వీరికి ఊహించనిరీతిలో ధనలాభం ఉంది. వ్యాపారస్తులకు మంచి లాభాలతోపాటు ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరిస్తారు. ఆర్థికంగా పటిష్టమైన స్థితికి చేరుకుంటారు. నవంబరు ఒకటో తేదీ నుంచి మహర్దశ పట్టుకున్నట్లే. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. కొత్త ఇంటిని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. పనిచేసేచోట పనితీరుపై పై అధికారుల నుంచి ప్రశంసలు వచ్చి మంచి గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి
నవంబరు ఒకటోతేదీ నుంచి ఈ రాశులవారికి బాగా కలిసివస్తుంది. ఏ పని తలపెట్టినా పూర్తవుతుంది. అందుకు అదృష్టం తోడుంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆర్థికంగా మంచిస్థాయికి చేరుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రిటర్న్స్ లభిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతోపాటు ప్రమోషన్ ఉంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే కానుంది.












Click it and Unblock the Notifications