నవపంచమ రాజయోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే యోగాలు శుభ మరియు అశుభ ఫలితాలకు కారణం అవుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు శుక్రుడు, యముడు ఒకదానికొకటి 120 డిగ్రీల వద్ద ఉంటూ శక్తివంతమైన నవ పంచమ యోగాన్ని ఏర్పరుస్తున్నారు.
నవ పంచమ రాజయోగంతో వీరికి ఆకస్మిక ధనలాభం
ఈరోజు ఉదయం 6.30 నిముషాలకు శుక్రుడు, యముడు ఒకదానితో ఒకటి 120 డిగ్రీలలో ఉంటారు. నవ పంచమ యోగం కారణంగా కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.ఈ సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
జూలై 7వ తేదీన శుక్రుడు యముడు శక్తివంతమైన రాజయోగాన్ని ఏర్పరిచి కలిగించిన నవ పంచమ రాజయోగం తో మేషరాశి జాతకులు శుభ ఫలితాలను చూస్తారు .ఈ సమయంలో మేష రాశి వారికి భౌతిక ఆనందం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వైద్య రంగంలో పని చేసేవారు మెరుగైన ధన లాభాలను పొందుతారు.
వృశ్చిక రాశి
నవ పంచమ రాజయోగంతో వృశ్చిక రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. నేటినుండి వృశ్చిక రాశి జాతకులు ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు పోయి సంతోషంగా జీవిస్తారు. శుక్రుడు మరియు యముడు సృష్టించిన ఈ యోగంతో పెళ్ళికాని వారికి వివాహ యోగం కలుగుతుంది. వైవాహిక జీవితం ప్రశాంతంగా ను, సంతోషంగానూ ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి బోలెడు లాభాలు వస్తాయి. ఇది వృశ్చిక రాశి వారికి అదృష్ట సమయం.
మకర రాశి
నవ పంచమ రాజయోగం మకర రాశి జాతకులను అదృష్ట జాతకులను చేస్తుంది. మకర రాశి వారు ఈ సమయంలో మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారు. వీరి ప్రేమ జీవితం మధురంగా మారుతుంది. పెళ్ళికాని వారికి పెళ్లి యోగం కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం తప్పనిసరిగా వస్తుంది. డబ్బు సమస్యలు తీరి సంతోషంగా జీవిస్తారు. ఆర్ధికంగా ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications