రెండురోజుల్లో నవ పంచమ రాజయోగం..వీరికి జాక్ పాట్ ఖాయం!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం కారణంగా వివిధ శుభ యోగాలు, వివిధ అశుభ యోగాలు ఏర్పడతాయి. ఇవి కొన్ని రాశులకు శుభాలను, మరికొన్ని రాశులకు అశుభాలను కలిగిస్తాయి. గ్రహాలు నిర్దిష్ట కాలమానంలో సంచారం చేస్తూ అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఫిబ్రవరి 6వ తేదీన సంపదను ఇచ్చే శుక్రుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి మిధున రాశిలో ఉంటాడు.
నవపంచమ రాజయోగం
ఈ రెండు గ్రహాలు నవ, పంచమ స్థానాలలో ఉండటం వల్ల నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కొన్ని రాశులకు స్వర్ణ యుగాన్ని ప్రారంభిస్తుంది. కొన్ని రాశుల జాతకులకు ఆకస్మిక ధన లాభం లభిస్తుంది. వారి అదృష్టం పెరుగుతుంది. మనస్సు సంతోషంగా ఉంటుంది. మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి జాతకులకు నవ పంచమ రాజయోగం శుభప్రదంగా మారుతుంది. ఈ కాలంలో మిధున రాశి జాతకులు అయిన నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారవేత్తలకు నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి .దీనివల్ల గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వివాహం చేసుకున్న వారు అద్భుతమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు . అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి.
తులారాశి
తులా రాశి జాతకులకు నవ పంచమ రాజయోగం ఏర్పడడం చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి సౌకర్యాలు, విలాసాలు పెరుగుతాయి. విద్యా, సృజనాత్మక రంగాలలో ఉన్న వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందుతారు. పని లేదా వ్యాపారంలో లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది.
సింహరాశి
సింహరాశి జాతకులకు నవ పంచమ రాజయోగం కారణంగా సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి. పనిలో మీ కృషి గుర్తించబడుతుంది. నాయకత్వ నైపుణ్యాలు మెరుగుపడతాయి .ఈ సమయంలో సింహ రాశి వారి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. చాలాకాలంగా నెరవేరని కోరికలు తీరుతాయి. ఇది వీరికి అన్ని విధాల లాభాలను చేకూరుస్తుంది.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications