30ఏళ్ళ తర్వాత మార్చి 2న మీనరాశిలో శుక్ర, శని సంయోగం.. వీరికి కుబేరయోగం
జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం నిర్దిష్ట కాలమానం ప్రకారం జరుగుతుంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సమయానుకూలంగా సంచారం చేస్తూ ఇతర గ్రహాలతో కలిసి అనేక యోగాలను ఏర్పరుస్తాయి. మార్చి రెండవ తేదీన శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీన రాశిలోకి సంచారం చేస్తాడు.
30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శుక్ర శని కలయిక
అప్పటికే శని దేవుడు మీన రాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల, దాదాపు 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శుక్ర శని కలయిక మొదటిసారి జరుగుతుంది. ఈ ప్రత్యేక కలయిక కొన్ని రాశుల వారికి కెరీర్ పరంగాను, హోదా పరంగాను, కొన్ని రాశుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశిని శుక్రుడు పాలిస్తాడు. సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు వృషభ రాశిలో ఆదాయ మరియు లాభ గృహాల నుండి సంచరిస్తాడు. ఈ క్రమంలో శని మరియు శుక్రుల కలయిక వృషభ రాశి జాతకులకు ఫలదాయకంగా ఉంటుంది. ఇది వీరికి ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు వస్తాయి. పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి.
తులారాశి
శుక్రుడు తులా రాశిని పాలిస్తాడు. అటువంటి శుక్రుడు తులా రాశిలో ఆరవ స్థానంలో శనితో కలయికను జరుపుతున్నాడు. అందువల్ల తులారాశి జాతకులు సమయంలో ఏ పని చేసిన సానుకూల ఫలితాలు వస్తాయి. తులారాశి జాతకులు కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి సానుకూల వార్తలు వస్తాయి. ఈ సమయంలో పాత విభేదాలు పరిష్కరించ బడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కుంభ రాశి
శని దేవుడిని కుంభ రాశికి అధిపతిగా భావిస్తాడు.శని శుక్రుల సంయోగం కుంభ రాశిలో 12వ ఇంట్లో జరుగుతుంది. ఈ సమయంలో కుంభ రాశి జాతకులకు డబ్బు ఆదా అవుతుంది. శత్రువుల పైన పైచేయి సాధిస్తారు కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. ప్రభుత్వం లేదా పాలన రంగంలో ఉన్న వారి ప్రయోజనాలను పొందుతారు. వ్యాపార విస్తరణకు అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టుల పైన పని ప్రారంభిస్తారు. ఆదాయ వనరులు ఉద్భవించే అవకాశం ఉంది. కొన్ని అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.












Click it and Unblock the Notifications