పాక్షిక సూర్య గ్రహణం: మనకు కనిపిస్తుందా?

Posted By:
Subscribe to Oneindia Telugu

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

partial solar eclipse on February 15

తేది 15-02-2018 గురువారము రోజున శ్రీ హేమలంబ నామ మాఘ అమావాస్య రోజున ఖండగ్రాస సూర్య గ్రహణము.అనగా పాక్షిక సూర్య గ్రహణం కుంభరాశిలో సంభవించనున్నది.

ఈ గ్రహణము మన భారత దేశములో కనిపించదు.కావున ఇట్టి సూర్య గ్రహణం మనకు వర్తించదు.కావున భారతదేశ ప్రజలు ఈ గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు.

ఈ సూర్య గ్రహణము దక్షిణ అమేరికా,అంటార్కిటికా,కింగ్ ఎడ్వర్డ్ పాయింట్,చిలీ,స్టాన్లీ,బ్రెజిల్,అర్జెంటీనా,పరాగ్వే మరియు ఉరుగ్వే తదితర ప్రదేశాలలో నివసించే వారికి వర్తిస్తుంది.ఈ ప్రదేశాల వారు గ్రహణ నియమాలను పాటించాలి.

గ్రహణ సమయ వివరాలు భారత కాల మానము ప్రకారము

గ్రహణ స్పర్శ కాలము రాత్రి 12:26 ని॥లకు 16 , ఫిబ్రవరి
గ్రహణ మధ్య కాలము రాత్రి 02:21 గం॥లు 16, ఫిబ్రవరి
గ్రహణ మోక్ష కాలము ఉదయం 04 : 17 ని॥లకు 16 , ఫిబ్రవరి అంటే సూర్య గ్రహణము రాత్రి 12 : 26 ని॥లకు ప్రారంభమయ్యి , ఉదయం 04:17 ని॥లకు ముగుస్తుంది.

ఈ సూర్య గ్రహణ పుణ్య కాలము మొత్తం 03:51 ని॥లు కలదు.


ఈ సూర్య గ్రహణాన్ని ఆయా ప్రాంతంలో నివసించే గర్భిణి స్త్రీలు గ్రహణాన్ని చూడకుండా ఉండడం ఉత్తమం.గ్రహణ దోష నివారణకు కొరకు ద్వాదశ రాశుల వారు గోమాతకు కిలోపావు బియ్యం,మినుములు,నువ్వులు,తోటకూర,బెల్లంను ఆవునకు తినిపించి మూడు ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి దోషలు ఉన్నా హరించుకు పోతాయి.ఇష్టపూర్వకంగా చేసినప్పుడే దాన ఫలితము లభించును.


గ్రహణ సమయములో సూర్య గాయత్రి జపము చేయుట వలన మంచి ఫలితాలుంటాయి.

ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.
గ్రహణ సమయంలో నదీ స్నానం చేసి,నదీ తీరములో అనుష్ఠానము చేసుకోవడము సంపూర్ణ ఫల ప్రదము,పుణ్య ప్రదము.


ప్రత్యేక సూచన భారత దేశంలో సూర్య గ్రహణం కనిపించడంలేదు కాబట్టి భారత దేశములో నివసించే వారికి ఈ గ్రహణ నియమాలు ఆచరించవలసిన అవసరం లేదు.ఈ సూర్య గ్రహణం పై తెలిపిన దేశాలలో ఏయే ప్రాంతాలలో కనిపిస్తుందో అయా దేశ,ప్రాంతాల నివసించే వారికి మాత్రమే గ్రహణ నియమాలు వర్తిస్తాయి ఇది గమనించ గలరు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer explains about the partial Solar eclipse to be taken plac on February 15.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి