చిరంజీవి సినిమాను కాపీ కొట్టి సూపర్ హిట్ ఇచ్చిన వెంకటేష్
టాలీవుడ్‌లో ఒకే కథతో ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలు చేయడం, ఒకరి సినిమాను మరొకరు స్ఫూర్తిగా తీసుకోవడం కొత్తేమీ కాదు. కానీ, ఒక స్టార్ హీరో సూపర్ హిట్ సినిమా లైన్‌ను, మరో స్టార్ హీరో కాస్త మార్చి తీసి బ్లాక్‌బస్టర్ కొట్టడం నిజంగానే ఒక క్రేజీ అప్‌డేట్. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ మధ్య జరిగిన ఈ విచిత్రమైన 'కాపీ' కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆసక్తికరమైన విషయాన్ని స్వయంగా ఆనాటి స్టార్ ప్రొడ్యూసర్ ఓపెన్‌గా ఒప్పేసుకోవడం విశేషం.
చిరంజీవి కెరీర్‌కు ఊపునిచ్చిన యాక్షన్ డ్రామా
అది 1981వ సంవత్సరం.. చిరంజీవి ఇంకా టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా మారలేదు. హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న సమయమది. ఆ టైమ్‌లో తమిళ బ్లాక్‌బస్టర్ 'సట్టం ఓరు ఇరుట్టరై' ఆధారంగా విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకత్వంలో 'చట్టానికి కళ్లు లేవు' అనే సినిమా చేశారు. 1981 అక్టోబర్ 30న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించి, చిరంజీవి కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది.

1986లో 'కలియుగ పాండవులు' సినిమాతో రామానాయుడు వారసుడిగా విక్టరీ వెంకటేష్ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, కృష్ణ వంటి టాప్ హీరోలు బాక్సాఫీస్‌ను ఏలుతున్నారు. వెంకీ ఎంట్రీతో ఇండస్ట్రీలో ఒక కొత్త పోటీ మొదలైంది. వెంకీ తనదైన స్టైల్‌తో దూసుకుపోయారు.
'శత్రువు'తో వెంకటేష్ బ్లాక్ బ్లస్టర్
1991లో వెంకటేష్, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన 'శత్రువు' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కోడి రామకృష్ణ దర్శకత్వంలో, ఎం.ఎస్. రాజు నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అయితే.. ఈ సినిమా మరేదో కాదు, చిరంజీవి నటించిన 'చట్టానికి కళ్లు లేవు' సినిమాకు కాపీ అట!. తాజాగా నిర్మాత ఎం.ఎస్. రాజు ఒక ఇంటర్వ్యూలో ఈ రహస్యాన్ని బట్టబయలు చేశారు.
"నాకు చిరంజీవి నటించిన 'చట్టానికి కళ్లు లేవు' సినిమా అంటే పడి చచ్చేంత ఇష్టం. అందుకే ఆ సినిమా కథనే కాస్త కాపీ కొట్టాను. కొన్ని క్యారెక్టర్స్ మార్చి, సరికొత్తగా సీన్స్ అల్లుకుని వెంకటేష్ తో 'శత్రువు' సినిమా తీశాను. ఒరిజినల్ సినిమాలో ఉన్న 'అక్కా-తమ్ముళ్ల' బంధాన్ని.. ఇక్కడ 'లవర్స్' ట్రాక్‌గా మార్చేశాను. నా ప్లాన్ వర్కవుట్ అయింది.. సినిమా సూపర్ హిట్ అయింది" అంటూ ఎం.ఎస్. రాజు నవ్వుతూ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications