"జబర్దస్త్"కు హైపర్ ఆది రీఎంట్రీ.. ఇక కామెడీకి డోకా ఉండదంతే..!!
తెలుగు బుల్లితెరపై కామెడీకి కొత్త నిర్వచనం చెప్పిన కమెడియన్ హైపర్ ఆది మళ్లీ 'జబర్దస్త్' వేదికపైకి రాబోతున్నాడనే సంకేతాలు అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తన పదునైన పంచులు, రాజకీయ సెటైర్లు, ప్రాసలతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆది.. కొంతకాలంగా షోకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలు, ఈవెంట్లు, ఇతర టెలివిజన్ కార్యక్రమాలతో బిజీ అయిన ఆయన తిరిగి జబర్దస్త్‌లో కనిపించకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే తాజా ప్రోమోలో ఇచ్చిన హింట్‌తో మళ్లీ ఆది ఎంట్రీపై సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది.
ప్రోమోలో ఆది ఎంట్రీతో పెరిగిన హైప్..
ఈ వారం ప్రసారం కానున్న జబర్దస్త్ ప్రోమోను ఈటీవీ విడుదల చేయగా, చివర్లో హైపర్ ఆది ఎంట్రీ హైలైట్‌గా నిలిచింది. స్టేజ్‌పైకి అడుగుపెట్టగానే నాగబాబును చూసి "జబర్దస్త్‌కి కొత్త కళ వచ్చిందబ్బా" అని చెప్పిన ఆది.. వెంటనే రష్మీ వైపు తిరిగి "జబర్దస్త్ ఓల్డ్ అయిపోయిందబ్బా" అంటూ తనదైన స్టైల్లో పంచ్ పేల్చాడు. ఈ ఒక్క డైలాగ్‌తోనే అభిమానులు పాత హైపర్ ఆదిని గుర్తు చేసుకున్నారు.ముఖ్యంగా "ఆది నరుకుతున్నాడు" అనే డైలాగ్ తన కెరీర్‌కి ఎంత బూస్ట్ ఇచ్చిందో నాగబాబుతో చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

"జూన్‌లో రీ-ఎంట్రీ"..
ప్రోమోలో నాగబాబు నేరుగా "మళ్లీ ఎప్పుడొస్తావు?" అని ప్రశ్నించగా.. ఆది ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. "ఎవరైతే నన్ను మిస్ అయ్యారో.. వారి కాంబినేషన్ సెట్ చేసుకుని జూన్‌లో రీ-ఎంట్రీ ఉంటుంది" అని చెప్పడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో జూన్ నెలలో హైపర్ ఆది ఫుల్ టైమ్‌గా తిరిగి జబర్దస్త్‌లో కనిపించనున్నాడా? లేక స్పెషల్ స్కిట్స్‌కే పరిమితం అవుతాడా? అన్న ఆసక్తి పెరిగింది. ఇప్పటికే సోషల్ మీడియాలో "జబర్దస్త్‌కి మళ్లీ గోల్డెన్ డేస్ వస్తున్నాయి" అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
పాత టీమ్‌తో మళ్లీ మ్యాజిక్?
హైపర్ ఆది పేరు వినగానే రైజింగ్ రాజ్, దొరబాబు లతో పాటు అప్పుడప్పుడు గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ వంటి కమెడియన్లతో చేసిన స్కిట్స్ గుర్తొస్తాయి. ముఖ్యంగా ఆది-సుధీర్ కాంబో అప్పట్లో టీఆర్పీలకు హామీగా ఉండేది. ఇప్పుడు మళ్లీ పాత టీమ్‌తో స్కిట్స్ చేస్తాడా? అనే చర్చ మొదలైంది. కొంతమంది అభిమానులు "ఆది వస్తేనే జబర్దస్త్‌కు అసలు కిక్ వస్తుంది" అంటుండగా.. మరికొందరు "ఆది లేకపోయాక షోలో పంచుల స్థాయి తగ్గిపోయింది" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ వారం స్కిట్స్ కూడా హైలైట్..
ఇక ఈ వారం ప్రోమోలో ధనాధన్ ధనరాజ్, ఫైమా, పొట్టి నరేష్, రాకెట్ రాఘవ, రోహిణి తదితరుల స్కిట్స్ కూడా మంచి నవ్వులు పంచాయి. ముఖ్యంగా ఫైమా-నరేష్ మధ్య జరిగిన వైన్ షాప్ కామెడీకి నాగబాబు ఇచ్చిన రియాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాకెట్ రాఘవ డాక్టర్ స్కిట్‌లో "టెస్టులు 30 వేలు అవుతుంది.. ఆ తర్వాత కూడా ఆపరేషన్ చేయాలంటాను" అనే డైలాగ్‌తో స్టేజ్ మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది. అలాగే రోహిణి ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్కిట్‌లో "ప్రియుడిని అన్నయ్య అని పిలవడం" కామెడీ హైలైట్‌గా నిలిచింది.
జబర్దస్త్‌కు మళ్లీ పాత వైభవం?
మరోవైపు కొన్నేళ్లుగా జబర్దస్త్‌లో పలువురు స్టార్ కమెడియన్లు షోను వీడడంతో పాత జోష్ తగ్గిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాంటి సమయంలో నాగబాబు రీ-ఎంట్రీ, ఇప్పుడు హైపర్ ఆది తిరిగి రావడం షోకు భారీ బూస్ట్ ఇస్తుందని టీవీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం విడుదలైన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబ్‌లో లక్షల వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ఇక జూన్‌లో నిజంగానే హైపర్ ఆది స్టేజ్‌పై పంచుల వర్షం కురిపిస్తాడా? అనేది చూడాలి.












Click it and Unblock the Notifications