ఈ రాశులవారికి డబ్బుల మూటలు.. శ్రావణ శుక్రవారం నుండి దశ తిరిగే రాశులివే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ అన్ని రాశుల వారి జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం శ్రావణమాసం కొనసాగుతుంది. శ్రావణ మాసం చాలా శుభప్రదమైన మాసం. ఈ మాసంలో లక్ష్మీ దేవికి, విష్ణు మూర్తికి పూజ చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి.
శ్రావణ శుక్రవారం నుండి విశేష ఫలితాలు వచ్చే రాశులు
ఈ మాసంలో గ్రహాల సంచారం కూడా అనేక విశేష ఫలితాలను ఇస్తుంది. అందులోనూ శ్రావణ శుక్రవారం వేళ గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారు లబ్ధిని పొందుతున్నారు. ఇక నేటి నుండి గ్రహాల సంచారంతో ఆకస్మిక ధన లాభాలను పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
ఈ శ్రావణ శుక్రవారం నుంచి మేష రాశి వారికి బాగా కలిసి వస్తుంది. మేష రాశి వారు ఏలినాటి శని తో బాధపడుతున్నప్పటికీ ఈ సమయంలో వీరికి సానుకూలమైన ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఇతరులతో గొడవలకు దిగకుండా కోపాన్ని తగ్గించుకుని ఉంటే మంచిది. ఈ సమయంలో మేష రాశిలో ఉన్న విద్యార్థులకు కలిసి వస్తుంది.
మిధున రాశి
మిధున రాశి వారికి శ్రావణ శుక్రవారం నుంచి శుభప్రదంగా ఉంటుంది. మిధున రాశి వారు కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ చాకచక్యంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగాలు చేసే వారికి సానుకూలంగా ఉంటుంది. మిధున రాశి వారి కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.
సింహరాశి
సింహ రాశి వారికి శ్రావణ శుక్రవారం నుంచి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి అష్టమ శని కొనసాగుతున్నప్పటికీ వీరికి ఈ సమయంలో కలిసి వస్తుంది. ఈరోజు నుంచి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. విద్యార్థులకు బాగుంటుంది. ఏదైనా దూర ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది సానుకూల సమయం. కాబట్టి సింహరాశి వారికి ఇది అదృష్ట సమయం.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications