వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమావాస్య రోజు సూర్య గ్రహణ నియమాలు, ఆ రాశికి చెందిన వారు గ్రహణం ఎందుకు చూడకూడదు..?

|
Google Oneindia TeluguNews

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

పాక్షిక సూర్యగ్రహణం:- శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఆశ్వీయుజ బహుళ అమావాస్య మంగళవారం రోజు అనగా ఆంగ్లమానం తేదీ ప్రకారం 25-10-2022 భారతదేశంలో కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం స్వాతి నక్షత్రం, తులారాశిలో గ్రహణం ఏర్పడనున్నది.

గ్రహణం కనిపించే ప్రదేశాలు :- తూర్పు ఆసియా, యూరప్, తూర్పు ఆఫ్రికా దేశాలు, పశ్చిమ ఆసియా, బెల్జియం, ఆఫ్ఘనిస్తాన్, బల్గేరియా, ఈజిప్ట్, గ్రీస్, జర్మనీ, ఇరాన్, ఇరాక్, ఇటలీ, రష్యా, యునైటెడ్ కింగ్ డం దేశాలు, గల్ఫ్ దేశాలలో ఈ గ్రహణం కనిపించును.

గ్రహణం కనబడని ప్రదేశాలు :- భారతదేశంలో తూర్పు ఈశాన్య ప్రాంతాలు మిజోరం, త్రిపుర, మణిపూర్ , నాగాలాండ్, మేఘాలయ, అస్సాం ప్రాంతాలలో ఈ గ్రహణం కనబడదు.

People who belong to Tula Rasi should not see the eclipse, Here is why

హైదారాబాద్ ప్రాంతంలో గ్రహణ సమయములు :-

స్పర్శ కాలం సాయంత్రం 4 : 58 నిమిషాలకు
మధ్యకాలం సాయంత్రం 5 : 27 నిమిషాలకు
మోక్ష కాలం సాయంత్రం 5 : 48 నిమిషాలకు.

ఈ గ్రహణం స్వాతి నక్షత్రం తులారాశిలో ఏర్పడనున్నది కాబట్టి తులారాశివారు గ్రహణం చూడరాదు. స్వాతి నక్షత్రం వ్యక్తులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది మరియు తులరాశిలో చంద్రుడు, సూర్యుడు లేదా తులా లగ్నమైననూ గ్రహణాన్ని చూడకుండా ఉంటే మంచిది.

తులారాశి వారు గ్రహణ సమయంలో ధ్యానస్థితిలో ఉండాలి, గ్రహణ సమయంలో బయటికి వెళ్లకుండా ఉండటం మంచిది. మీరు ఉండే ఊరిలో గ్రహణ సమయం ఏమిటి అనే విషయం తెలియకపోతే సాయంత్రం 4 : 55 నుండి 6 : 40 వరకు పరిగణించండి.

గ్రహణ సమయంలో పాటించ వలసినవి :- పట్టు విడుపు స్నానాలు చేయాలి. నిలువగా పెట్టుకున్న తినే ఆహార పదార్ధాలపై గరిక వేసి పెట్టుకోండి. గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక చింతనతో ఉండాలి. గ్రహణం తరువాత ఇంటిని శుభ్రం చేసుకుని పవిత్ర స్నానం చేయండి. జంధ్యం మార్చుకోవాలి, దేవుని విగ్రహాలు, యంత్రాలు పులికాపీ చేసుకోవాలి. నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడికాయ, కొబ్బరికాయ మొదలగునవి తీసివేసి కొత్తగా పూజించిన వాటిని కట్టుకోవాలి. ఎవ్వరూ గ్రహణ సమయంలో భోజనం చేయరాదు. ప్రెషగా వండుకున్న ఆహారం తీసుకోండి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో నుదుట విభూది ధరించి కొంగులో కొంత గరిక పోచలు కట్టుకోండి, నిర్మలమైన మనస్సుతో మీకు నచ్చిన దైవనామ స్మరణ చేసుకోండి. సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా రెస్టు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో ఉండండి.

అపోహలు, మూఢనమ్మకాలను నమ్మవద్దు:- గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు అస్సలు కదలకుండా ఉండాలని, మల మూత్ర విసర్జన చేయకూడదని వదంతులు నమ్మకండి, మీరు మీకు నచ్చినట్టుగా ప్రశాంతగా ఉండండి చాలు. ఏలాంటి అనుమానాలు పెట్టుకోకండి, అమాయకంగా ఉండకండి.. చాదస్తాలకు పోకండి.

ద్వాదశ రాశుల వారికి గ్రహణ ఫలితాలు:- మీ వ్యక్తి గత జాతకంలో దశ, అంతర్ధశ, గోచార గ్రహస్థితి ( అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని ) స్థితి అనుకూలంగా లేని వారికి మానసిక, కుటుంబ, దాంపత్య సమస్యలు, ఆరోగ్య, ఆర్ధిక, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో ప్రతికూల ఫలితాలు కనబడేవిగా గోచరిస్తున్నాయి.

మేషరాశి వారికి స్త్రీ మూలక లేదా భాగస్వామ్య వ్యవహారాలలో ఇబ్బందులు.

వృషభరాశి వారికి సౌఖ్యం.

మిధునరాశివారికి మానసిక చింతన.

కర్కాటకరాశి వారికి వ్యధ.

సింహరాశి వారికి ధనలాభం.

కన్యారాశి వారికి హాని కలిగే సూచనలు.

తులారాశి వారికి 'ఘాతం' ప్రతికూలత.

వృశ్చికరాశి వారికి వ్యయం.

ధనస్సురాశి వారికి లాభసాటి ఫలితాలు.

మకరరాశి వారికి సుఖ సౌఖ్యాలు.

కుంభరాశి వారికి మాన నాశం.

మీనరాశి వారికి అతి కష్టమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.

పరిహారాలు :- ఆర్ధిక స్తోమత, ఆసక్తి ఉన్నవారు జపదానాలు, శాంతి పరిహార ప్రక్రియలు పాటించండి. ఆర్ధిక స్తోమత లేనివారు "గోధుమలు, ఉలువలు, బెల్లం, తోటకూర అరటిపండును" మీ మీ శక్త్యానుసారంగా గోమాతకు సమర్పించండి, ధాన్యాన్ని నానబెట్టినవే తినిపించండి, మీరు పెట్టిన గ్రాసం ఆవు తింటున్నప్పుడు గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసుకోండి. లేదా ఈ వస్తువులను నిరుపేదలకు కూడా ఇవ్వవచ్చును, రెండింటి ఫలితాలు ఒక్కటే. దానం అనేది ప్రేమతో భక్తితో ఇష్టపూర్వకంగా చేయండి, పెద్దలు ఏదో చెప్పారు తప్పదు ఏదో చేయాలట అనే భావనకు మాత్రం రాకండి, ఒకవేళ అలాంటి ఉద్దేశంతో ఉంటే మాత్రం ఏమి చేయకపోవడమే బెటర్. సద్భావంతో చేసే పనులకే సత్ఫలితాలు వస్తాయి.

పండగ వివరణ:- 24-10-2022 సోమవారం రోజున సూర్యోదయానికి పూర్వం 4 :35 నిమిషాల నుండి ఉదయం 7 :30 నిమిషాల వరకు మరియు ఉదయం 9 : 00 గంటల నుండి ఉదయం 10:30 వరకు మంగళ హారతులు తీసుకోవాలి, అదే రోజు సాయంత్రం 5 : 28 నిమిషాల నుండి అమావాస్య ప్రారంభం అవుతుంది కాబట్టి రాత్రి 11: 35 వరకు లక్ష్మీ పూజలు నిర్వహించుకోవాలి. కేదార నోములు గ్రహణం మరుసటి రోజు అన్ని శుద్ధి చేసుకున్న తర్వాత 26 బుధవారం రోజు నోములు, వ్రతాలు జరిపించుకోవాలి. ఈ సంవత్సరం శుక్ర మౌఢ్యమి, గ్రహణశూల వర్తిస్తుంది కావున శాస్త్ర ప్రకారం కొత్త అల్లులకు హారతులు, నూతన వస్త్రాలు స్వీకరించుటకు పనికిరాదు.

English summary
People belonging to tula rasi should not see the solar eclipse.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X