మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!

మార్చి 19వ తేదీన తెలుగు వారి సంవత్సరాది ప్రారంభమైంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో పంచాంగం ప్రకారం వివిధ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం మనం మీన రాశి వారి వార్షిక జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.

మీన రాశి వారి ఆదాయ వ్యయాలు

పూర్వభాద్ర నాలుగో పాదం, ఉత్తరాభాద్ర ఒకటి నుండి నాలుగు పాదములు, రేవతి 1 నుండి 4 పాదములకు చెందిన వారు మీనరాశి వారు. ఈ సంవత్సరం అన్ని విధాల శుభదాయకంగా ఉంటుంది. మీన రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం రెండుగా ఉంటాయి. మీనరాశి జాతకులు సంకల్ప సిద్ధితో అనుకున్నది సాధిస్తారు. ఈ సంవత్సరం వీరికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

pisces Yearly Horoscope astrological predictions of meenarashi 2026-27 these are the year results

ఆర్థిక స్థితి

ఈ సంవత్సరం మీన రాశి వారి ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు అయినప్పటికీ అవసరాలకు కావలసిన ధనం సమకూరుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. లావాదేవీలు అనుకూలిస్తాయి. ఈ సంవత్సరం వస్త్ర ప్రాప్తి జరుగుతుంది. ఏ పని అనుకున్న సక్సెస్ అవుతారు.

ఉద్యోగ పరంగా

ఉద్యోగపరంగా మీన రాశి వారికి విశేషమైన ఫలితాలు వస్తాయి. సమర్థతకు గుర్తింపు వస్తుంది. అధికారుల నుండి మెప్పు పొందుతారు. నగదు బహుమతులు గెలుచుకుంటారు. స్థాన చలనంతో కూడిన పదోన్నతులు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. కష్టమైన కేసులు సైతం సునాయాసంగా గెలిచి, సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు.

వ్యాపారులకు

మీనరాశిలో వ్యాపారాలు చేసే వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో మీనరాశి జాతకులు నూతన వ్యాపారాలను చేపడతారు. ఆకర్షణీయమైన స్కీమ్స్ పెట్టి విక్రయాలను జోరుగా సాగిస్తారు. పట్టు, చేనేత, కలంకారి వ్యాపారుల ఆదాయం బాగుంటుంది. ఈ సమయంలో నూతన భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే కలిసి వస్తుంది.

కుటుంబ స్థితి

మీన రాశి వారి గృహంలో సంతోషంతో ఉంటారు. బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. ఇంట్లో శుభకార్యాలు తో పాటు బంధుమిత్రుల రాకపోకలతో సందడిగా మారుతుంది. దంపతుల మధ్య చిన్న చిన్న చిరాకులు ఉన్నా అవన్నీ మరిచిపోయి కలిసిమెలిసి ఉంటారు.

ఆరోగ్య స్థితి

మీన రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సమయానికి మందులు వేసుకోవడం ఆహార నియమాలు పాటించడం చేయడం మంచిది. స్వల్ప అనారోగ్యాలు తలెత్తినా నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరమని చెప్పబడింది.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+