• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పితృఋణ విమోచన మహాలయ పక్షం: ఏం చేయాలి?

|

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"

ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,

యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,

పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.

సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

ప్రతి మానవుడు వారి పితృ దేవతలకు, దేవతలకు కృతజ్ఞతలు తెలపవలసినదే.ప్రతి ఒక్కరూ పితృ దేవతలకు ఋణపడి ఉంటారు. కావున వారిని పితృ యజ్ఞం ద్వారా తృప్తిపరచాలి. వీటితోపాటు మనతోటి మనుష్యులకు సహాయపడాలి.కనీసం రోజూ ఒక అతిథిని ఆదరించి ఆహారం ఇవ్వాలి అది మనుష్యయజ్ఞం.

అందరు చేయవలసినది చేయగలిగినది భూతయజ్ఞం. అన్ని ప్రాణులయందు ప్రేమ, దయ కలిగిఉండటం, ఆహారం అందించడం వంటివి. పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం అందరూ ఏదోఒక రకంగా చేయవలసినవే. ప్రతి ఒక్కరూ వైదిక ధర్మం ప్రకారం ప్రతి కార్యాన్ని ఈశ్వరార్పణం చేసి కాలం గడిపితే అతను బ్రహ్మయజ్ఞం చేస్తున్నట్లు.

Pitru Paksha Vimochana Mahalaya Paksha

పితృ దేవతలు - తాత ముత్తాతలు. అందరూ వారి ఋణాన్ని తీర్చవలసినదే. వేదము "మాతృ దేవోభవ, పితృ దేవోభవ" అని చెప్తుంది. అంటే మన తల్లి తండ్రులు దైవ సమానులు.వారిని ఎన్నటికి చిన్న చూపు చూడరాదు,దూషించరాదు. వారు స్వభావరిత్య ఎంత చెడ్డవారైనప్పటికి వారిని నిందించడం పిల్లల పని కాదు. వారు ఎలాంటి వారైనా వారు తల్లి తండ్రులే పిల్లలకు ప్రత్యక్ష దైవాలే అని గ్రహించాలి.

వారు ఈ లోకమును వదిలి వెళ్ళిన తరువాత తప్పకుండా వారికి శాస్త్రప్రకారంగా శ్రాద్ధ కర్మములు చేయవలెను. శ్రాద్ధ కర్మను నిరసించిన సంస్కర్తలు కూడా తల్లి తండ్రులను కాపాడుకోవలెను అని ఒప్పుకున్నారు.

"మనం సమర్పించే నువ్వులు, నీళ్ళు, అన్న పిండములు, ఫలములు ఇక్కడే ఉంటాయి కదా? మన కళ్ళ ముందు చనిపోయినవారు వచ్చి ఎప్పుడు తినలేదు కదా? పునర్జన్మ సిధ్ధాంత ప్రకారం వారు మరలా జన్మించియుంటే, వారికోసమని ఇవన్ని చెయ్యటం పిచ్చిపని" అని కొందరి వాదన.

అందుకు ఒక కథ ఉంది

"ఒక తండ్రి తన కొడుకును దూరాన ఉన్న ఒక పట్నమునకు పైచదువులకై పంపించాడు. కొన్ని దినములలో ఫీజు కట్టవలనెని ఆ అబ్బాయి తన తండ్రికి టెలిగ్రాఫిక్ మనీయార్డరు ద్వారా డబ్బు పంపమని ఒక లేఖ రాసాడు." తండ్రి కార్త కలవరపడ్డాడు. అతను టెలిగ్రాఫ్ కార్యాలయానికి వెళ్ళి గుమాస్తా గారికి డబ్బులిచ్చి టెలిగ్రాఫిక్ మనీయార్డరు ద్వారా ఆ డబ్బును తన కొడుక్కి పంపమన్నాడు.

డబ్బులకి కన్నాలు చేసి అందులోకి తంతి దూర్చి దాన్ని మొత్తం వాళ్ళ అబ్బాయికి పంపుతాడు అని అనుకున్నాడు. కొద్దిసేపటి తరువాత ఆ గుమాస్తా డబ్బు మీ అబ్బాయికి పంప బడింది.అతనికి చేరుతుంది అని అన్నాడు. ఆ తండ్రి మళ్ళి కలవరపడ్డాడు.తను ఇచ్చిన డబ్బు అక్కడ ఉన్న గల్లా పెట్టెలోనే ఉంది. డబ్బుల్ని కట్టి ముడి కూడా వేయలేదు.

అతను గుమాస్తా గారితో నేను ఇచ్చిన డబ్బు ఇక్కడే ఉంది.మరి మా అబ్బాయికి ఎలా పంపారు ? అని అన్నాడు. గుమాస్తా అతనితో "మీ అబ్బాయికి చేరుతుంది" అని భరోసా ఇచ్చాడు. తరువాత అతను సందేశములు పంపు పనిలో మునిగిపోయాడు.ఆ పల్లెటూరి తండ్రి సంత్రుప్తి పడలేదు.

కాని వాళ్ళ అబ్బాయికి ఆ డబ్బు చేరింది.

పితృ దేవతలకు పిండ ప్రదానము చేయడం కూడా అటువంటిదే. శాస్త్ర ప్రకారం చేయవలసిన క్రతువు శ్రద్ధగా చేస్తే పెట్టిన శ్రాద్ధం పితృ దేవతలకు అందేటట్టు దేవతలు చేస్తారు.వారు ఆవులుగా పుట్టినట్టైతే పెట్టిన శ్రాద్ధం వారికి గడ్డి, దాణా రూపంలో అందుతుంది. పరమాత్మ ఆజ్ఞ ప్రకారం సంబంధించిన దేవతలు వారికి అందిస్తారు.

కనుక చనిపోయిన తల్లికి తండ్రికి పెట్టిన శ్రాద్ధం వారే వచ్చి తీసుకోవాలి అని లేదు. అది వారికి చెందుతుంది అంతే.

ఇచ్చిన డబ్బు మనీయార్డరు ద్వారా చిరునామాకు చేర్చబడింది కదా? అతను ఈ దేశములో నివసించకపోయినను అక్కడ మన డబ్బు చెల్లుబాటు కాదు కాబట్టి ఇక్కడ రూపాయిలలో ఇచ్చినా అక్కడి డాలర్లుగానో, పౌండ్లగానో మార్చి ఇవ్వబడే వ్యవస్థ ఉంటుంది. అలాగే ఈశ్వరుని వ్యవస్థలో కూడా పితృదేవతలకు సమర్పించినది వారికి చెందుతుంది.

ఇక్కడ ముఖ్యముగా ఉండవలసినది తల్లితండ్రులయందు కృతజ్ఞతా భావము.శాస్త్రముయందు నమ్మకము.శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధము అంటారు. ఇది నమ్మకానికి చాలా ప్రాముఖ్యత ఉంది.మనం ఏదైనా చేస్తే అది ఎలా చెప్పబడిందో ఎలా చేయాలో అలాగే చేయాలి. మనం ఒక ఉత్తరం రాస్తే అది ఎవరికి చేరాలో వారికి చేరుతుందా లెదా ? ఇష్టం వచ్చిన చిరునామా వ్రాసి పోస్ట్ డబ్బాలో వేయలేదు ఇంట్లో ఉన్న డబ్బాలో వేసాము అనుకోండి అంటే ఏలాగు అది చేరదు.

ప్రేమ, భక్తి , జ్ఞానము వంటి స్థితులకు ఎటువంటి నియమము లేదు. కాని ఫలాన్ని ఆశించి చేసే ఏ కర్మకైనా నియమము అవసరము.ఆ నియమములను తెలిపేదే శాస్త్రము. శ్రద్ధతో సశాస్త్రీయంగా చేసిన శ్రాద్ధం తప్పక ఫలితాన్నిస్తుంది.

"తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యా కార్యా వ్యవస్థితౌ"

.మనం చేసే పనిని ఏకాగ్రతో చేస్టే తప్పక సత్ఫలితం లభిస్తుంది.ఎవరికోసమో చేయడం కాదు మీ కోసం మీ కుటుంబ శ్రేయస్సు కోసం పెద్దలు శాస్త్రం చెప్పినట్లుగా చేస్తే పిత్రుఋణాలు తీరి అంత మంచి జరిగి శుభాలు కలుగుతాయి

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pitru Paksha, also spelt as Pitri paksha, Pitr Paksha is a 16 lunar day period in Hindu calendar when Hindus pay homage to their ancestor, especially through food offerings. The period is also known as Pitru Pakshya, Pitri Pokkho, Sola Shraddha, Kanagat, Jitiya, Mahalaya Paksha and Apara paksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more