29న నవగ్రహాల మహా సంయోగం.. ఆరోజు 4 రాజయోగాలు

ఈనెల 22వ తేదీ నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అవి 30వ తేదీ వరకు కొనసాగుతాయి. మార్చి 29, బుధవారం రోజు అష్టమి తిథి రాబోతోంది. ఇదే రోజు మహా అష్టమి హవన-కన్యా పూజ చేస్తారు. ఈ శుభదినం రోజు కొన్ని ముఖ్యమైన గ్రహాల కలయిక ఏర్పడబోతోంది. ప్రజల జీవితాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. 30 సంవత్సరాల తర్వాత చైత్ర నవరాత్రుల్లో నవగ్రహాల మహా సంయోగం జరగబోతోంది. మహాష్టమి రోజు శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉంటాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి తన సొంత రాశి అయిన మీనంలో ఉంటుంది. మహా అష్టమి రోజు హన్స్, మాలవ్య, కేదార్, మహాభాగ్య వంటి రాజయోగాల గొప్ప కలయిక ఏర్పడుతుంది. మహా అష్టమి రోజు 4 రాజయోగాలు కలిసి ఏర్పడటం కొన్ని రాశులవారికి అద్భుతమైన ఫలితాలను సమకూర్చి పెట్టబోతోంది. ఆ రాశులేంటనేది చూద్దాం.

* మీనం: మీన రాశి వారికి ఈ రాజయోగం భారీగా డబ్బును తెస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ రావడంతోపాటు వారి కల నేరవేరుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి పదవి అవకాశం కలగబోతోంది.

planets maha samyoga on march 29th 2023

* కన్య: మహాష్టమి రోజు గ్రహాల మహా సంయోగం కన్యా రాశి వారికి మంచి పురోభివృద్ధిని ఇవ్వబోతోంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు, జీతాలు పెరగడంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాల్లో అత్యధిక లాభాలను పొందుతారు.

* మిథునరాశి: చైత్ర నవరాత్రుల్లో వచ్చే అష్టమి మిథునరాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది. ప్రేమలో సక్సెస్ అవుతారు. వివాహం కానివారికి వివాహమయ్యే యోగం ఉంది. ఉద్యోగం, వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది. ఈ సమయం వారికి చాలా బాగుంది.

* కర్కాటకం: మహాష్టమి కర్కాటక రాశి వారికి ఊహించని ఫలితాలనివ్వబోతోంది. గౌరవాన్ని, పదవిని, ధనాన్ని ఇవ్వడంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించబోతోంది. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. వీరి జీవితంలో ఆనందం నెలకొనడమే కాకుండా ఆర్థిక స్థితి లాభదాయకంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+