'టాక్సిక్' మూవీ వారికి మాత్రమే.. సినిమా అంతా అవే ఉంటాయి..!

కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ గుర్తింపు తెచ్చుకున్నారు రాకింగ్ స్టార్ యశ్. ప్రస్తుతం ఆయన లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్. ఈ మూవీ అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆగస్టు 26 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మలయాళీ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ మూవీలో హీరోయిన్లు చాలామందే ఉన్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషీలతో సినిమాలో గ్లామర్ డోస్ భారీగా పెరిగింది. ఓ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటించడం చాలా అరుదు. అది కూడా వీరందరికీ శక్తివంతమైన పాత్రలు లభించాయి.

అలాగే ఈ క్రేజీ మూవీలో అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ కీలక పాత్రలు పోషించారు. టాక్సిక్ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. రవి బస్రూర్ గతంలో కేజీఎఫ్, సలార్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీని కేవీఎన్ బ్యానర్స్​ పై యశ్​, వెంకట్​ కే నారాయణ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత వెంకట్ కే నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీపై ఆయన చేసిన కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

టాక్సిక్ మూవీ స్కేల్ డిఫరెంట్, ఈ సినిమా గ్రాండియర్ డిఫరెంట్, అలాగే స్టోరీ టెల్లింగ్ కూడా డిఫరెంట్ అని తెలిపారు. ఈ సినిమా గురించి మేము ఒక్కటే చెబుతున్నాము.. ఇట్స్ ఏ ఫెయిరీ టేల్ కేవలం గ్రోన్ అప్స్ కోసం మాత్రమే తీశారు అని వెల్లడించారు. దాంతో ఈ మూవీలో హాట్, వైలెంట్ కంటెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Toxic Film producer Venkat K Narayana has shared a key update on Rocking Star Yash s movie Toxic

ఇక టాక్సిక్ మూవీ ఈ ఏడాది వేసవిలోనే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. టాక్సిక్ మూవీ కన్నడ, ఇంగ్లీష్​, హిందీ, మలయాళం, తెలుగు, తమిళంతో పాటు ఏకంగా 6 భారతీయ భాషల్లో ఒకేసారి పాన్ ​ఇండియా లెవెల్​లో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్, టీజర్, పాటలు నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+