పదేళ్ళ తర్వాత జనవరి 29న బుధ శుక్రుల యుతి.. ఈ రాశులవారికి సంపదల పురోగతి!
జ్యోతిష్య శాస్త్రంలో 2026 సంవత్సరం అనేక యోగాలను ఏర్పరుస్తుంది. ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఇక జనవరి 29వ తేదీన బుధుడు మరియు శుక్రుడు ఒకదానికొకటి సున్నా డిగ్రీల వద్ద ఉంటారు. దీని కారణంగా యుతి దృష్టి యోగం ఏర్పడుతుంది.
శుక్ర, బుధుల కలయికతో యుతి దృష్టి యోగం
ఈ సంయోగం కొన్ని రాశుల వారి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొన్ని రాశుల వారికి ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. 10 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న యుతి దృష్టి యోగం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

కుంభరాశి
బుధుడు మరియు శుక్రుడు కలయిక కారణంగా ఏర్పడే యుతి దృష్టి యోగంతో కుంభరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతున్నారు. ఈ సమయంలో ఊహించని ఆర్థికలాభాలు కలుగుతాయి. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. కెరీర్లో పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి. కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఈ సమయంలో మీ ధైర్యం, శౌర్యం పెరుగుతాయి. కోరికలు నెరవేరుతాయి.
మిధున రాశి
మిధున రాశి వారికి బుధుడు మరియు శుక్రుడు కలయిక కారణంగా ఏర్పడే యుతి దృష్టి యోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. మిధున రాశి వారు పనిలోను, వ్యాపారం లోను మంచి పురోగతిని చూస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న డబ్బును పొందవచ్చు. శుభ ఫలితాలను అనుభవిస్తారు. అపారమైన ఆర్థిక లాభం కలుగుతుంది . వైవాహిక జీవితానికి ఇది మంచి సమయం.
తులారాశి
తులా రాశి వారికి బుధుడు శుక్రుడు కలయిక కారణంగా ఏర్పడే యుతి దృష్టి యోగం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో పనిలో మీరు అదృష్టాన్ని చూస్తారు. కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి. కొత్త ప్రాజెక్ట్ లు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయి.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications