శని ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారికి త్వరలో ధనయోగం!
ప్రస్తుతం కుంభరాశిలో శని తిరోగమన దిశలో ప్రయాణం చేస్తున్నాడు. నవంబర్ 15వ తేదీ నుంచి శని ప్రత్యక్ష మార్గంలో పయనిస్తాడు దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. శని తిరోగమనం నుంచి ప్రత్యక్షమార్గంలో ప్రయాణం చేయడం మొత్తం 12 రాశులపైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ముఖ్యంగా మూడు రాశుల వారికి మాత్రం శని ప్రత్యక్ష సంచారం కలిసి వస్తుంది. ఆ రాశులేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మిధున రాశి
శని ప్రత్యక్ష సంచారం కారణంగా మిధున రాశి జాతకులకు ప్రయోజనాలు చేకూరుతాయి. మిధున రాశి వారి కెరీర్ లో పురోగతి ఉంటుంది. వీరిలో క్రియేటివిటీ పెరుగుతుంది. సృజనాత్మక కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. సహోద్యోగులు, స్నేహితుల మద్దతు లభిస్తుంది. సామాజిక రంగంలో కూడా గౌరవ మర్యాదలను పొందుతారు. వారికి ఈ సమయంలో ఆర్థికంగా కలిసి వస్తుంది. సామాజికంగానూ మీ సామర్థ్యం బాగా పెరుగుతుంది.

సింహరాశి
శని ప్రత్యక్షసంచారం కారణంగా సింహరాశి వారికి ఈ సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయి. సింహరాశి జాతకులు ఈ సమయంలో ఎదురయ్యే అన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు. సింహరాశి జాతకులు ఈ సమయంలో తమ నాయకత్వాన్ని ప్రదర్శిస్తారు. ఈ సమయంలో చేసే ప్రయాణాలు లాభాలను చేకూరుస్తాయి. శని దేవుడు దయతో ఆర్థికంగాను గణనీయమైన ఫలితాలను పొందుతారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక లాభాలు వస్తాయి. బాగా డబ్బు సంపాదించడానికి అవకాశాలు వస్తాయి.
ధనుస్సు రాశి
శని ప్రత్యక్ష సంచారం కారణంగా ధనుస్సు రాశి వారికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ధనుస్సు రాశి జాతకులకు ఈ రోజులు మంచి రోజులు అని చెప్పాలి. వీరి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. శని అనుగ్రహంతో వీరు కష్టానికి తగిన ప్రతిఫలాలను పొందుతారు. శని ప్రత్యక్ష సంచారం కారణంగా వీరి పని ప్రశంసించబడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయాలు సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కష్టపడి పనిచేసే వారికి శని ఎప్పుడూ అండగా ఉంటాడు. ధనుస్సు రాశి జాతకులకు శని ఈ సమయంలో అదృష్టాన్ని ఇస్తాడు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications