2027వరకు వీరికి రాజభోగాలు, విలాసాలు.. శాసించిన శనిదేవుడు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. క్రమశిక్షణకు మారుపేరైన, కర్మలను బట్టి మనకు ఫలితాలను ఇచ్చే శని దేవుడి ప్రభావం మన జీవితంపై కచ్చితంగా ఉంటుంది. శని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది. నిదానంగా ప్రయాణం చేసే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు.
శని సంచారంతో అదృష్ట రాశులు
ఇక 2025లో శని తన స్థానాన్ని మార్చుకుని మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని 2025లో సంచారము కుంభ రాశి నుండి బృహస్పతి రాశి అయిన మీన రాశిలోకి జరుగుతుంది. ఈ సంచారము మార్చి 29, 2025న రాత్రి 10:07 గంటలకు ప్రారంభమవుతుంది. మీనరాశిలో శనిసంచారం కొన్ని రాశుల వారికి 2027 వ సంవత్సరం వరకు అదృష్టాన్ని ఇస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
2025 సంవత్సరంలో వృషభ రాశి వారికి శని సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీనరాశిలోకి శనిసంచారం వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పనిచేసే చోట పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. పై అధికారుల నుండి మన్ననలు పొందుతారు
కన్యారాశి
2025లో శని కన్య రాశి వారికి సానుకూల ప్రయోజనాలను ఇస్తుంది. కన్యారాశి జాతకులకు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. జీవితంలో ఈ సమయంలో కన్యా రాశి వారికి పురోగతి కనిపిస్తుంది. 2027 వరకు వీరికి అదృష్ట యోగం ఉంది. పనిచేసే చోట పై అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
మకర రాశి
మకర రాశి వారికి శని గ్రహం కారణంగా అనుకూల ఫలితాలు వస్తాయి . మకర రాశి వారికి 2027వరకు తిరుగే ఉండదు. ఈ సమయంలో డబ్బుకు లోటుండదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెళ్లికాని వారికి వివాహం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications