వెండి పాదాలతో శని .. 2025లో వీరికి సంపదల వర్షం!

క్రమశిక్షణకు మారుపేరైన, కర్మలకు దేవుడు అయిన శని మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 2025 సంవత్సరంలో శని మీనరాశిలోకి ప్రవేశం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే శని మీనరాశిలోకి వెళ్ళేటప్పుడు వెండి పాదాలతో నడుస్తాడు. వెండి పాదాలతో మీనరాశిలోకి ప్రవేశించే శని కొన్ని రాశుల వారిపైన సంపదల వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఇక శని సంచార సమయంలో వృద్ధి పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
2025 లో శని ఆశీర్వాదం వృషభ రాశి జాతకుల పైన మెండుగా ఉంటుంది. 2025 లో వృషభ రాశి జాతకులు శని వెండి పాదంతో నడుస్తున్న కారణంగా ఆర్థిక లాభాలను పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో అద్భుతమైన రాబడులను ఇస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలతో కెరీర్ లో పురోగతి కనిపిస్తుంది. వ్యక్తిగతంగా సంబంధాలు వృద్ధి చెందుతాయి.

Saturn transit with silver feet in 2025 gives wealth and good fortune to these zodiac signs

కన్యారాశి
శని వెండి పాదంతో నడవడం వల్ల 2025లో కన్యారాశి జాతకులకు అపారమైన వృద్ధి, శ్రేయస్సు కలుగుతుంది. దీర్ఘకాలిక ప్రాజెక్టులలో పురోగతి ఉంటుంది. భవిష్యత్తు పెట్టుబడుల కోసం ప్లాన్ చేయడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో ప్రియమైన వారితో సంబంధాలు సంతోషాన్ని ఇస్తాయి.

మకర రాశి
వెండి పాదంతో నడిచే శని మకర రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తాడు. మకర రాశి వారు వృత్తిపరమైన ప్రయత్నాలలో విజయాలను ఆశించవచ్చు. శని ప్రభావం మకర రాశి వారిలో ఏకాగ్రతను, క్రమశిక్షణను పెంచుతుంది. మకర రాశి వారి జీవితాలలో శాంతి మరియు సుఖం ఈ సమయంలో వస్తుంది. ఈ సమయంలో సంపద వృద్ధి జరుగుతుంది.

మీనరాశి
వెండి పాదంతో నడిచే శని మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల మీన రాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. శ్రమకు, పట్టుదలకు శని ప్రతిఫలం ఇస్తున్న కారణంగా మీన రాశి వారి కలలు సాకారం అవుతాయి. ఈ సమయంలో ఆర్థిక లాభాలు, కెరీర్ పురోగతి కలుగుతుంది. ప్రియమైన వారితో జీవితాన్ని సంతోషంగా గడుపుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+