త్వరలో అమావాస్య యుక్త షష్ఠ గ్రహ కూటమి.. దేశానికి కొత్త భయం!!
వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. 2025 సంవత్సరంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం, వివిధ గ్రహాలు కలిసి ఏర్పాటు చేస్తున్న కూటములు ఖగోళ మార్పులకు కారణమవుతున్నాయి. 2025 మార్చి 29వ తేదీన షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది.
మార్చి 29న షష్ఠ గ్రహ కూటమి
గతంలో 2019 డిసెంబర్ 25వ తేదీన షష్ఠగ్రహ కూటమి ఏర్పడింది. ఆ తరువాత కరోనా మహమ్మారి విజృంభించి విలయ తాండవం చేసింది. ఇక ఇప్పుడు మళ్లీ 2025 మార్చి 29వ తేదీన షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇదే సమయంలో ప్రస్తుతం చైనా వైరస్ హెచ్ఎంపీవీ భయం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది.

షష్ఠ గ్రహ కూటమి ఎఫెక్ట్ ..హెచ్ఎంపివి వైరస్ విజృంభిస్తుందా?
అయితే ఈసారి కూడా గతంలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడినప్పుడు కరోనా మహమ్మారి విజృంభించినట్టు, హెచ్ఎం పివి వైరస్ విజృంభిస్తుందా అన్న ఆందోళన పలువురిలో వ్యక్తం అవుతుంది. అయితే ఈసారి ఏర్పడే షష్ఠగ్రహ కూటమి అంత ప్రభావంతమైన కూటమి కాదని దీనివల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కునే అవకాశం లేదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఆరు గ్రహాలు మీనరాశిలో సంచారం
గత ఏడాది అక్టోబర్ 23వ తేదీన రాహువు మీనరాశిలోకి ప్రవేశించి సంచారం చేస్తున్నాడు. జనవరి 28వ తేదీన శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక ఫిబ్రవరి 28వ తేదీన బుధుడు మీనరాశిలోకి వస్తున్నాడు. మార్చి 15వ తేదీన రవి మీనరాశి లోకి వస్తున్నాడు. మార్చి 28వ తేదీన చంద్రుడు మీన రాశిలోకి వస్తున్నాడు. మార్చి 29వ తేదీన శని దేవుడు మీన రాశిలోకి సంచరించనున్నాడు.
ఆరు గ్రహాల సంయోగంతో అమావాస్య నాడు షష్ఠ గ్రహ కూటమి
ఇక మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని ఆరు గ్రహాలు సంయోగం చెందడం వల్ల షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ షష్ఠగ్రహ కూటమి ప్రభావం ద్వాదశ రాశుల వారిపై మే 31వ తేదీ వరకు కచ్చితంగా ఉంటుంది. మార్చి 29వ తేదీన ఏర్పడే షష్ఠగ్రహ కూటమి కూడా అమావాస్యతో కూడుకున్న షష్ఠగ్రహ కూటమి కావడం మరొక ప్రాధాన్యత సంతరించుకునే అంశం.
హెచ్ఎంపీవీ వైరస్ పై ఆందోళన అవసరం లేదు
షష్ఠగ్రహ కూటమి ప్రభావం కొన్ని రాశుల వారి పైన ప్రతికూలంగానూ మరికొన్ని రాశుల వారి పైన సానుకూలంగానూ ఉంటుంది. అయితే గతంలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడినప్పుడు కరోనా మహమ్మారి వచ్చినట్టు, ఇప్పుడు చైనా నుంచి మరో వైరస్ వచ్చిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దీని ప్రభావం మానవ జీవితం పైన పెద్దగా ఉండబోదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ప్రతికూల ప్రభావాలు వస్తే జాగ్రత్త పడాలి
షష్ఠగ్రహ కూటమి ఏర్పడిన మీనరాశిలోని గ్రహాల స్థానాలను బట్టి ఇతర రాశులలో ఆయా గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకుని దానినిబట్టి నెగిటివ్ ప్రభావాలు వచ్చేవారు జాగ్రత్తగా పరిహారాలను పాటిస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications