వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంతానం లేకపోయినా.. సంపద రావాలన్నా ఈ స్వామిని పూజించాల్సిందే..!!

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

కుమారేశసూనో! గుహస్కందసేనా
పతే శక్తిపాణే మయూరాధిరూఢ
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్
ప్రభో తారకారే సదారక్ష మాం త్వమ్

చాలా మంది పిల్లలు పుట్టకపోయినా, జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా సుబ్రమణ్య స్వామిని పూజిస్తే ఫలితం కనిపిస్తుందని నమ్ముతారు. ఇంతకీ ఆ సుబ్రహ్మణ్యస్వామి జన్మించింది ఎప్పుడూ అంటే.... కుమారషష్టి రోజే !

Skandha Panchami: If you have no children to which god you need to offer Pooja,Know here

శివుడు ఓసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో మన్మధుడు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించాడట, అంతే ! మన్మధుడి మీద శివునికి విపరీతమైన కోపం వచ్చేసింది... వెంటనే తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేశాడు. అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటకు వచ్చింది. ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడట, దాంతో ఆయన దాన్ని గంగానదిలో రెల్లుపొదల మధ్య విడిచిపెట్టాడు, ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది.

కుమారస్వామి అవతరించింది ఆషాఢమాసంలోని షష్టి తిథినాడే అని కొందరి నమ్మకం, అందుకే ఆ రోజుని కుమారషష్టి పేరుతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. కుమారస్వామి ఆరు ముఖాలతో అవతరించాడు కాబట్టి ఆయనను షణ్ముఖుడు అని పిలుస్తారు. అందుకే ఆయనకు షష్టి తిథి అంటే చాలా ఇష్టం. ఇక ఆషాఢమాసంలో తను పుట్టిన రోజైన కుమారషష్టి అంటే మరీ ఇష్టం.

కుమారషష్టిని రెండు రోజులపాటు ఘనంగా చేసుకుంటారు. ఆ ముందు రోజుని స్కందపంచమిగా పిలుస్తారు. ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి , కుమారషష్టి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఈ రెండు రోజుల్లో వల్లీదేవసేన సమేతంగా ఉన్నా స్వామి ఆలయానికి వెళ్తి దర్శించుకుంటే సంతానం కలిగి తీరుతుంది. ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించినా, సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది. వీలైతే మనకి దగ్గరలో ఉన్న నాగరాళ్లు లేదా పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదాన్ని ఉంచి పాలు పోసినా మంచిదే !

స్కందపంచమి, కుమారషష్టి రోజులలో ఇలా స్వామిని కనుక ఆరాధిస్తే జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని పెద్దలు అంటారు. సంతానం కలగాలన్నా, సంపదలు రావాలన్నా ఈ రోజు స్వామిని పూజించాలి.

కోర్టు లావాదేవీలలో విజయం సాధించాలన్నా, రాబోయే పరీక్షలలో మంచి మార్కులు రావాలన్నా ఈ స్కందపంచమి, షష్టి తిథులలో స్వామిని తల్చుకోవాలని పురాణ వచనం.

స్కంద పంచమి / షష్ఠి వ్రత విధానం :-

స్కంద షష్ఠి వ్రతమును పాటించేవారు ప్రతినెలా శుక్ల పక్ష షష్ఠి రోజున అంటే పంచమి, షష్ఠి కలిసిన రోజున ఉపవాసం ఉండాలి. కార్తీక మాసములో సూర సంహారం సందర్భంగా ఆరు రోజుల పాటు ఉపవాసం పాటిస్తారు. స్వామి షోడశోపచార పూజ చేసి స్వామి స్తోత్రాలను పఠించాలి.

సుబ్రమణ్య స్వామి స్తోత్రాలు :-

సుబ్రమణ్య అష్టకం కరవాలంబ స్తోత్రం
సుబ్రమణ్య పంచరత్న స్తోత్రం
సుబ్రమణ్య అష్టోత్తర శతనామావళి
స్కంద షష్ఠి కవచం

English summary
When there are no children to the couple and if there is some jataka Dosha then to get rid of this one need to praise Lord subrahmanya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X