ఫిబ్రవరిలో తొలి సూర్యగ్రహణం చాలా శక్తివంతం.. భారీ నష్టాన్ని ఎదుర్కొనే రాశులివే!
2026 సంవత్సరంలో సంభవించబోయే మొదటి సూర్యగ్రహణం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. 2026 ఫిబ్రవరి 17వ తేదీన మంగళవారం నాడు ఫాల్గుణ అమావాస్య రోజున మధ్యాహ్నం మూడు గంటల 26 నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. అది రాత్రి 7 గంటల 57 నిమిషాల వరకు కొనసాగుతుంది.
తొలి సూర్యగ్రహణం.. ఈ రాశులకు నష్టం
ఈ సమయంలో సూర్యుడు శని రాశి అయిన కుంభరాశిలో సంచారం చేస్తాడు. దీని ప్రభావం ద్వాదశ రాశుల వారి పైన పడుతుంది. ఈ సూర్యగ్రహణం కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి మొదటి సూర్యగ్రహణం కారణంగా ఇబ్బందులను ఎదుర్కొనే ఆ రాశులను తెలుసుకుందాం.

సింహరాశి
సింహ రాశి వారికి మొదటి సూర్యగ్రహణం తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సూర్యగ్రహణం నాడు మీరు ఏ పని చేసిన ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యక్తిగత మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఆర్థిక విషయంలోనూ, ఆరోగ్య విషయాలలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం.
కన్యారాశి
కన్యారాశి నుంచి ఆరో స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో కన్యారాశి జాతకులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగులు వ్యాపారులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఈ సమయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాలి
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి నుంచి నాల్గవ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడడం వల్ల వృశ్చిక రాశి వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబ జీవితంలో ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. పెట్టుబడులు, ఆస్తి సంబంధిత విషయాలలో రిస్క్ తీసుకోకూడదు. చెడు స్నేహాలు చేయకుండా ఉంటే మంచిది.
కుంభరాశి
మొదటి సూర్యగ్రహణం కుంభరాశి వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఇది వీరి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. చేపట్టిన పనులలో నిరాశ ఎదురవుతుంది. పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
మీనరాశి
సూర్య గ్రహణ సమయంలో మీన రాశి వారి జాగ్రత్తగా ఉండాలి. వర్తక వ్యాపారాలు చేసే వారికి తీవ్రమైన నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండకుంటే ఇబ్బంది పడతారు. ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెడితే నష్టపోతారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో ఓపికగా వ్యవహరించడం అవసరం.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications