వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

solar eclipse2022: నేడు సూర్యగ్రహణం.. ఈ 5రాశుల వారికి ప్రతికూల ప్రభావం; జాగ్రత్త!!

|
Google Oneindia TeluguNews

దీపావళి తర్వాత రోజైన నేడు సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఇప్పటికే మనం సూర్యగ్రహణం ఏ సమయానికి ఏర్పడుతుంది? ఏ ఏ ప్రాంతాలలో ప్రభావం ఉంటుంది? ఎంత సమయం పాటు సూర్యగ్రహణం మనకు కనిపిస్తుంది? ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వంటి అనేక విషయాలను తెలుసుకున్నాం. ఎప్పుడు సూర్య గ్రహణం ఏ రాశుల వారు ప్రధానంగా చూడకూడదు? ఏ నక్షత్ర జాతకులకు ఈ సూర్యగ్రహణం మంచిది కాదు? ఏ రాశి వారికి సూర్య గ్రహణం తరువాత నుండి కలిసివస్తుంది వంటి అనేక విషయాలను తెలుసుకోబోతున్నాం.

సూర్య గ్రహణం.. రాశులపై ప్రభావం

సూర్య గ్రహణం.. రాశులపై ప్రభావం


దీపావళి తర్వాత రోజైన నేడు పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుందని తెలిసిందే. భారతదేశంలో సూర్య గ్రహణం సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం వివిధ రాశులపై వేర్వేరు ప్రభావాలను చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష శాస్త్ర పండితులు అంచనా ప్రకారం ఈ సూర్యగ్రహణం సింహ రాశి, ధనస్సు రాశి, మకర రాశి, వృషభ రాశి వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇక సూర్య గ్రహణం మేష రాశి, కుంభ రాశి, మిధున రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది.

 5 రాశుల వారిపై సూర్య గ్రహణం ప్రతికూల ప్రభావం

5 రాశుల వారిపై సూర్య గ్రహణం ప్రతికూల ప్రభావం

ఇది కాకుండా ఈ గ్రహణం మిగిలిన 5 రాశులపై ప్రతికూల ప్రభావాన్ని సూచిస్తుంది. కర్కాటకం, కన్య, తుల వృశ్చికము, మీన రాశి వారికి ప్రతికూలంగా ఉంటుందని, ఈ 5 రాశుల వారు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. అంతేకాదు ఈ గ్రహణాన్ని స్వాతి నక్షత్ర జాతకులు, తులారాశి వారు అసలు చూడకూడదని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాలలో 44 నిమిషాల పాటు గ్రహణ ప్రభావం

తెలుగు రాష్ట్రాలలో 44 నిమిషాల పాటు గ్రహణ ప్రభావం

ఇక తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం ప్రభావం 44 నిమిషాల పాటు ఉంటుందని గ్రహణ సమయంలో ఆకాశం నుండి అతినీలలోహిత కిరణాలు భూమిపై పడి ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయని, అందుకేగా గ్రహణ సమయంలో బయటకు వెళ్లడం మంచిది కాదని చెబుతున్నారు. గ్రహణం పట్టిన సూర్యుని ఎవరు నేరుగా చూడకూడదని, ఒకవేళ చూస్తే కంటి చూపు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

 ఈ రాశుల వారికి సూర్యగ్రహణం శుభప్రదం

ఈ రాశుల వారికి సూర్యగ్రహణం శుభప్రదం

ఈ సూర్య గ్రహణం ముఖ్యంగా ధనస్సు రాశి, మకర రాశి, సింహరాశి, వృషభ రాశి వారికి శుభాలను కలిగిస్తుందని సూచిస్తున్నారు. వృషభ రాశి వారికి పెట్టుబడి పెట్టడానికి సూర్య గ్రహణం తర్వాత నుంచి సమయం కలిసి వస్తుందని, ఈ సమయంలో అనేక ఆర్థిక లాభాలు వారికి వస్తాయని చెబుతున్నారు. కొత్త వాహనాన్ని లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి ఇది అనుకూలమైన సమయమని సూచిస్తున్నారు.

ఆర్ధిక ఇబ్బందులు తొలగి ఈ రాశుల వారికి అంతా అదృష్టమే

ఆర్ధిక ఇబ్బందులు తొలగి ఈ రాశుల వారికి అంతా అదృష్టమే

ఇక సింహ రాశి వారికి కూడా నూతన గృహ యోగం ఉందని చెబుతున్నారు. కొత్త పనులు వారు ప్రారంభించడానికి శుభతరుణం అని, వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుందని చెబుతున్నారు. ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ధనస్సు రాశి వారికి, మకర రాశి వారికి కూడా వారు అనుకున్న పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని, అనేక సమస్యల నుండి బయట పడతారని, ఆర్థికంగా జీవితం మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Today solar eclipse.. Cancer, Virgo, Libra, Scorpio, Pisces are advised to be careful as it will be negative for them. This solar eclipse is considered auspicious for Leo, Sagittarius, Capricorn and Taurus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X