త్వరలో కేతువు, బృహస్పతి నవపంచమ యోగంతో దరిద్రులు కూడా కుబేరులవుతారు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి మరియు కేతువు కలయికతో నవపంచమయోగం ఏర్పడుతుంది. నవగ్రహాలలో ముఖ్య గ్రహంగా భావించే గురువు అత్యంత క్రూరమైన గ్రహంగా భావించే కేతువు రెండు మే 1వ తేదీన సంయోగం చెంది నవ పంచమ యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ రెండు గ్రహాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి సంపదల వర్షం కురువబోతుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికి కేతువు, బృహస్పతి ప్రభావంతో మేలు జరుగుతుంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. గురువు ప్రభావంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మేష రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు. వ్యక్తిగత జీవితంలో సమస్యలన్నీ పరిష్కారమై సంతోషంగా జీవిస్తారు.

వృషభ రాశి
వృషభ రాశిలో కేతువు పంచమ స్థానంలో ఉండడం వల్ల, గురువు స్థానం బలంగా ఉండడం వల్ల శుభ ఫలితాలను పొందుతున్నారు. ఈ సమయంలో ఉద్యోగస్తులకు పని భారం తగ్గుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి మన్నన లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వివాహితులు సంతానం గురించి శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు కేతువు గురువు ప్రభావంతో అనేక లాభాలను పొందుతారు. ఈ సమయంలో కర్కాటక రాశి వారు చేసే ప్రతి ప్రయత్నంలోనే విజయాలు సాధిస్తారు. కర్కాటక రాశి వారి ఆదాయం బాగా పెరుగుతుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పదోన్నతులు కలుగుతాయి.
సింహరాశి
గురువు కేతువు ప్రభావంతో సింహ రాశి వారికి లబ్ధి జరుగుతుంది. నవ పంచమయోగం కారణంగా సింహ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది.
మకర రాశి
మకర రాశిలోకి కేతువు భాగ్య స్థానంలో, గురువు ఉన్నత స్థానంలో సంచరించడం వల్ల వీరికి లబ్ధి జరుగుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనేక మార్గాలలో ఆదాయ వనరులు పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది. ఇది మకర రాశి వారికి శుభ ఫలితాలను ఇచ్చే సమయం.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications