సూర్య గోచారం.. నవంబర్ 19వరకు వీరు మట్టి ముట్టుకున్నా బంగారమే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గ్రహాల రాజు సూర్యుడు తన నక్షత్రాన్ని మార్చుకొని బృహస్పతికి చెందిన నక్షత్రంలోకి ప్రవేశించాడు. స్వాతి నక్షత్రం నుండి విశాఖ నక్షత్రంలో నవంబర్ ఆరవ తేదీన ఉదయం 8.56 నిమిషాలకు ప్రవేశించిన సూర్యుడు నవంబర్ 19వ తేదీ వరకు విశాఖ నక్షత్రంలోనే సంచరించనున్నాడు.
విశాఖ నక్షత్రంలోకి సూర్యుడు
ఆపై సూర్యుడు విశాఖ నక్షత్రం నుంచి నవంబర్ 19వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాలకు అనురాధ నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు. విశాఖ నక్షత్రంలో సూర్య సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు రానున్నాయి. వీరికి ఆకస్మిక ధనలాభం కలగనుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
విశాఖ నక్షత్రంలో సూర్యసంచారం కారణంగా మేష రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మేషరాశి జాతకుల పిల్లలు ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు. మేషరాశి జాతకులకు ధన లాభాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఇది మేష రాశి జాతకులకు శుభ సమయం.
సింహరాశి
సింహరాశి జాతకులకు విశాఖ నక్షత్రంలో సూర్యుడు సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సింహరాశి జాతకులు ఆర్థికంగా మెరుగైన స్థితిని చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చిక రాశి
విశాఖ నక్షత్రంలో సూర్యుని సంచారం వృశ్చిక రాశి జాతకులకు చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇక సూర్యసంచారం కారణంగా వృశ్చిక రాశి జాతకులకు రాబోయే రోజులన్నీ మంచి రోజులుగానే ఉంటాయి. వృశ్చిక రాశి జాతకులు నిర్ణయించుకున్న ఏ పనిలో అయినా తప్పకుండా విజయం సాధిస్తారు. ఎంతో కాలంగా చెడిపోతున్న పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. మొత్తంగా వృశ్చిక రాశి వారికి ఇది అదృష్టాన్ని ఇచ్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications