లక్కీ నెంబర్ 8: వారికి ఆత్మ విశ్వాసం అధికం

Posted By:
Subscribe to Oneindia Telugu

8వ సంఖ్య అదృష్ట సంఖ్యగల వ్యక్తుల స్వభావం గురించి మాట్లాడాలంటే చాలానే చెప్పాల్సి ఉంటుంది. ఏనెలలోనైనా, సంవత్సరములో నైనా 8, 17, 26 తేదీలలో పుట్టిన స్త్రీ పురుషులంతా 8వ సంఖ్యకు చెందిన వారు. 8 వ సంఖ్యకు శని అధిపతి. ఈ 8వ సంఖ్యకు చెందిన వారు శనివారము రోజు పుట్టటం మంచిది. మరియు వీరంతా ప్రతీ సంవత్సరము 21 డిసెంబర్‌ నుండి జనవరి 26 మధ్యకాలంలో 8, 17, 26 తేదీలలో జన్మించి ఉంటే వారకి శని సంఖ్య యొక్క ప్రభావం గుణగణములు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికితోడు వారి పుట్టిన తేదీ, నెల సంవత్సరము మొత్తము కూడగా వచ్చే ఏక సంఖ్య లక్కీ నెంబర్‌ కూడా సంఖ్య 8 వస్తే మరీ లాభం.

అయితే ఈ 8వ సంఖ్యవారు 26 జనవరి నుండి 26 ఫిబ్రవరి మధ్యకాలంలో పుట్టటం మంచిది కాదు. ఆ కాలంలో శని ప్రభావం చెడు ఫలితాలను ఇచ్చే సమయం కాబట్టి ఈ 8వ సంఖ్యవారు ఈ కాలంలో పుట్టకపోవటం చాలా మంచిది.
శని జాతకులు ఎక్కువగా ప్రతీ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకొంటారు. అందువల్ల వీరు ఒంటరితనాన్ని కోరుకొంటారు. సమాజంకు దూరంగా బ్రతకాలనుకొంటారు. కొందరు శని జాతకులలో బాబాలు, సన్యాసులు, ఇల్లువిడచి తీర్థయాత్రలు చేసేవారుంటారు. వీరు వారికి నచ్చని ఏ సంఘటన జరిగినా అందరికీ దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.

The fate persons having 8 as lucky number

వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. పూర్తి స్వతంత్ర జీవితాన్నే కోరుకొంటారు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు. మానసికంగా బాధపడతారు. అయినను వీరు ఇతరులకు మేలు చేస్తారు. దైవాన్ని నమ్ముతారు. దైవ కార్యక్రమములు చేస్తారు. వారు చేపట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఎందరిని అయినా ఎదిరించటానికి సిద్ధపడతారు. శతృత్వం కొని తెచ్చుకొంటారు. వీరిలో చాలా వరకు సమాజ సేవ, సమాజానికి సలహాలివ్వాలన్న తాపత్రయం ఉంటుంది.

8వ సంఖ్యవారు జీవితంలో చాలా గొప్ప పనులు చేస్తారు. ఒక్కొక్కసారి చాలా పొరపాట్లు కూడా చేస్తుంటారు. అందరి చేత అసహ్యించుకోబడుతారు. 8వ సంఖ్యవారి ఆశయం చాలా మంచిది. సమాజ సేవ, ప్రభుత్వ సేవ చేయాలనుకొంటారు. గొప్ప బాధ్యతలు చేపట్టుతారు. వాటికి న్యాయం చేస్తారు. ఎంత త్యాగానికైనా వెనుకాడరు. 4వ సంఖ్యవారికి 2వ 8వ సంఖ్యవారికి కొన్ని దగ్గరి పోలికలుంటాయి. వీరు ఇరువురు కలిసి స్నేహం చేయగలరు. వీరి అభిప్రాయాలు కలుస్తాయి.

8వ సంఖ్యవారు కేవలం వారి స్వశక్తినే నమ్ముకొంటారు. ఇతరులపై ఆధారపడరు. ఒంటరి జీవితంనే కోరుకొంటారు. వీరికి వివాహా జీవితం అంతసంతృప్తికరంగా ఉండదు. వీరు దయగలవారే కాని కోప స్వభావం కలవారుగా కన్పిస్తారు.
8వ సంఖ్యవారు అనేక రకములుగా కష్టములు అనుభవించి ఆర్థిక ఇబ్బందులు పడి అనుకోకుండా అకస్మాత్తుగా అభివృద్ధి పొందుతారు. ధైర్యం ఎక్కువ వీరికి. మంచి బలవంతులు. అయితే తొందరగా తృప్తి చెందరు. ప్రతీ విషయంలో లోపాలు వెతుకుతారు. ప్రతీ విషయమును శ్రద్ధతో పరిశీలిస్తారు. లోపం ఉండటం వీరికి నచ్చదు. ఏ మాత్రం లోపం ఉన్నా సహించరు. తృప్తి పడరు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The persons having lucky number 8 will have lot self confidence, according to astrologer.
Please Wait while comments are loading...