దీపావళి రోజు 5 యోగాలు.. ఈ రాశులకు రూ.5 కోట్లు
ఈనెల 31వ తేదీ నుంచి నవంబరు రెండోతేదీ వరకు ఈసారి దీపావళిని జరుపుకుంటారు. ఈ పండగ సందర్భంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఐదు యోగాలు ఏర్పడ్డాయి. మనిషి జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. గజకేసరి యోగం, ఆయుష్మాన్ యోగం, శశ మహాపురుష యోగం, బుధాదిత్య యోగం, గజకేసరి రాజయోగం ఏర్పడుతున్నాయి. చంద్రుడు, బృహస్పతి, బుధుడు, శుక్రుడు, శని స్థానాలవల్ల ఇవి కలుగుతున్నాయి. దీనివల్ల కొన్ని రాశులవారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
మేషరాశి
కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సంపద వీరికి ఈ సమయంలోనే సొంతమవుతుంది. కొన్నాళ్లుగా న్యాయపరమైన వివాదాలున్నప్పటికీ ఇప్పుడు విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు వారి వారి కార్యాలయాల్లో మంచి పేరు రావడంతోపాటు పదోన్నతి లభిస్తుంది. కుటుంబ జీవితం ఎంతో సౌఖ్యంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం లభించడంతోపాటు ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు.

ధనుస్సురాశి
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలగడంతో ఎంతో సంతోషంగా ఉంటారు. పెళ్లి కానివారికి నచ్చిన అమ్మాయితోనే వివాహం అవుతుంది. దీపావళి నుంచి ఒకరకంగా వీరి సుడి తిరిగిందని చెప్పొచ్చు. అలాగే శుభవార్తలను వింటారు. కొన్నాళ్లుగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభించడంతో మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి, అనురక్తి కలుగుతుంది.
మిథున రాశి
వీరికి అన్ని పనుల్లో అదృష్టం తోడుంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి కోరిక ఈ సమయంలోనే నెరవేరుతుంది. పచ్చిపాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేయడంవల్ల కోరుకున్న కోరిక, మనసులోని కోరిక నెరవేరుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెల్లివిరుస్తుంది.












Click it and Unblock the Notifications