వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివ మహిమ,శివ నామమహిమ

By Pratap
|
Google Oneindia TeluguNews

విద్యాసుశృతిరుత్కృష్టా ,తత్ర రుద్రైకాదశినీస్మృతా ।
తత్ర పంచాక్షరీం , తస్య శివఇత్యక్షరద్వయం ॥

విద్యలన్నింటిలో వేదముగొప్పదిగా చెపుతారు,అందులోనూ సంహితాకాండలోని రుద్రము(వీటినే నమక చమకాలనికూడా అంటారు)అందులో ఓం నమశ్శివాయ అనేపంచాక్షరి అనేమంత్రం గొప్పది అందులోనూ శివ అనే రెండక్షరాలు చాలాగొప్పవి.అని శాస్త్రవచనం.

శివనామమును నారాయణుడు యోగనిద్రలో జపిస్తాడని ప్రతీతి.దేవోత్తముడైన శివునిస్మరణ చేసినవానికి జీవితంలో భోగభాగ్యములను పొందుతారు,మరణానంతరం శివులోకములో సాలోక్యము (శివలోకముగా ఉండుట) పొందుతారు,లేదా సామీప్య (శీవునికిదగ్గరగా ఉండుట) జరుగుతుంది, లేదా సారూప్య (శివరూపాన్నీపొందటం )జరుగుతుంది లేదా మోక్షము (అంటే వీటికన్నా అతీత స్థితిపొందుట) జరుగుతుంది అని శివపురాణము ఉదాహరిస్తుంది.

The importance of Siva Raatri

మూడుమూర్తులకును మూడులోకములకు మూడుకాలములకు మూలమగుచు
భేదమగుచు తుదికభేదమైయొప్పారు
బ్రహ్మమనగ నీవె ఫాలనయన (పోతన భాగవతం)

సృష్టి స్థితి లయకారకులగు మూడు దేవతామూర్తులకు ,పైలోకాలు,భూలోకము,క్రిందిలోకాలనే మూడు లోకాలకు ,భూతభవిష్యత్‌ వర్తమానకాలాలనేమూడుకాలాలకి మూలముగా ఉండి అన్నిగా విడిపోయి చివరకు తనలోనింపుకునే ఒకే అణు స్వరూప శక్తి శంకరుడు.

శంకరోతి ఇతి శంకరః అనగా శమము లేదా శాంతినిచేయువాడు అని అర్థము.

దుఃఖమునందున్నవారికి ఉపశమనం శివనామస్మరణ చేసనవారికి దినదినాభివృద్ధి కలుగుతుంది.
అభిశేకప్రియశ్శివః
అలంకారప్రియో విష్ణుః ,అభిషేక ప్రియశ్శివః అని ఆగమాదులు చెపుతున్నాయి.
అలంకారము విష్ణువుకి,అభిషేక శివునికి ప్రీతి.

శివునుశిరమునకాసిన్ని నీళ్లుజల్లి
పత్తిరిసుమంతనెవ్వాడు పారవైచు
కామధేనువు వానింటి గాడిపశువు
అల్లసురశాఖ వానింటిమల్లెచెట్టు (చాటువు)

శివునికి అభిశేకంచేసి పత్రితో పూజించినవాడికి కోరికలు తీర్చే కామధేనువు ఇంటి పశువౌతుంది.ఏదైనా ఇవ్వగలిగే కల్పవృక్షం పెరటి చెట్టౌతుంది (అంతగా వరములిస్తాడని తాత్పర్యం)

శివరాత్రి అంటే

శివరూమం లింరూపం అందులోనూ వృత్తాకారం శివుడు,పానవట్టం పార్వతీరూపం అని ఆగమవాక్యం.ఒకప్పుడు హరిబ్రహ్మాదులకు చైతన్యకారకంగురించి స్పర్థ వచ్చినప్పుడు వారిమధ్య ఒక పెద్ద జ్యోతి రూపం ఏర్పడిరది. ఆ రూపం పై కొన చూడటానికి హంస రూపంలో బ్రహ్మ ,వరాహంగా విష్ణువు వెళ్లారు ఎంతసేపటికీ అంతుతెలియక అలసిపోయి ప్రార్థన చేయగా ఆజ్యోతి శివలింగాకారంగా శివాప్రతీకగా ఏర్పడినది.

జ్ఞానరూపి అయిన శివుడు చైతన్యజ్యోతిగా ఆవిర్భవించిన రాత్రి అమావాస్య గా చెపుతారు దానిముందురోజు అఇవరాత్రిగా చెపుతారు.కాబట్టే లోకంలో ఇప్పటికీ త్రయోదశి చతుర్దశి కలిసిన రోజుని శివరాఇగా చెపుతారు ఇదిప్రతిమాసంలో వస్తుంది.

కానీ పాలసముద్రం చిలికినపుడు హాలాహలభక్షణం చేసి ఒక చిన్న రేగుపండుఅంతగా చేసి కంఠంలో ధరించినరాత్రి లోకాల్నికాపాడిన శివుని ఆరాత్రి జాగరణతో దేవతలు జనులు ప్రార్థించినరాత్రిగా మహాశివరాత్రిఅని చెపుతారు.
లోకమంతా శివరక్షణవల్ల మంగళాన్ని పొందుటవల్ల దానికిప్రతీకగా శివ కళ్యాణాన్ని కూడ జరుపుతారు.

లింగోద్భవ పుణ్యకాలం ` 17 ఫిబ్రవరి ,అర్ధరాత్రి 12 గంటలకు

శివరాత్రి నాడు చేయవలసిన విధులు

ప్రతఃకాలంలో లేవడం
ఉతికిన వస్త్రాలు ధరించాలి
దేవాలుదర్శనం చేయాలి
అన్నం కాకుండా పాలు, పండ్లు పలహారంమాత్రమే తీసుకోవాలి
తక్కువ ఆహారం తీసుకోవాలి
ఇతరులతో మటల్లోకూడా దైవసంబంధమైనవే ఎక్కువగా ఉండటం
వీలైనంత తక్కువ వమాట్లడటం
ఎక్కువసేపు పంచాక్షరీ జపం చేయటం
పండ్లు పలహారాలు దేవునుకి నివేదించటం వాటిని ఇతరులకు పంచిపెట్టటం
వీలైనంత వరకు జాగరణచేయటం
శివునికి అభిశేకం చేస్తే చాలామంచిది
చాపమీద పడుకోవటం ,
స్త్రీ లైనా పురుషులైనా బ్రహ్మచర్యం పాటించటం
లింగోద్భవపుణ్యకాలం వరకూ మేల్కొని ండాలి వీలైతే మరుసటి రోజువరకూ ఉండాలి.

శివరాత్రి చేయకూడనివి

అనారోగ్యంతో ఉపవాసం చేయకండి సాత్విక ఆహారం స్వీకరించి పూజించండి.
ప్రాతస్సంధ్య,సాయం సంధ్యలో ్ల నిద్రపోకండి,
శివ పూజకి మొగలిపూవు వాడకండి .
నీటిని అభిశేకానికి ఎక్కువగా వాడండి ఇతరపదార్థాలు (పంచామృతం,పండ్లరసాలు,సుగంధ పరిమళ పదార్థాలు తక్కువగావాడండి.
సిమెంట్‌ రాతివంటి అన్నిలింగాలకన్నా పుట్టమన్నుతో చేసినశివలింగానికి అభిశేకిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది.
తినాల్సిన స్థితివస్తే పిండిపదార్థాలు తీసుకోవచ్చు.

English summary
An eminent astrologer Maruthi Sharma has explained the importance of Siva Raatri
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X