వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హేవిలంబి నామ సంవత్సరంలోని ముఖ్యమైన విశేషాలు

హేవలంబి నామ సంవత్సరంలోని ముఖ్యమైన రోజుల వివరాలను జ్యోతిష్కుడు మనకు అందించారు. వాటిని ఇక్కడ చదవండి.

By Pratap
|
Google Oneindia TeluguNews

ఆదిత్యం తేజసాం స్థానం హేవిలమ్బ కృతాహ్వయమ్ |
సప్త సప్తి సమారూఢం జగతాం నేత్ర మాశ్రయే |
కర్తరీ సమయమలు (ఈకాలములో వివాహాది శుభాకర్యములుండవు)
వైశాఖ శుక్ల నవమీ గురువారం (04.05.2017) నుండి డొల్లు కర్తరి.

వైశాఖ కృష్ణ పాడ్యమీ గురువారం (11.05, 2017) లగాయితు జ్యేష్ఠ శుక్ల తృతీయా ఆదివారము (28.05.2017) వరకు నిజకర్తరీ.

మౌఢ్యసమయములు (ఈకాలములో వివాహాది శుభాకర్యములుండవు)
ఫాలున కృష్ణ సప్తమి ఆదివారము 19-08-2017 నుండి చైత్ర శుక్ల విదియ బుధవారము 29-03-2017 వరకు శుక్రమౌఢ్యము.
ఆశ్వయుజ కృష్ణ షష్టి బుధవారము 11-10-2017 నుండి కార్తిక కృష్ణ పంచమీ బుధవారము 08-11-2017వరకు గురుమౌఢ్యము.

మార్గశిర శుక్ల నవమి మంగళవారము 28-11-2017 నుండి ఫాలున శుక్ల చవితి సోమవారము 19-02-2018 వరకు శుక్రమౌఢ్యము.

పుష్కరము

భాద్రపద బహుళ సప్తమీ మంగళవారం 12-09-2017 నుండి సార్థ త్రికోటి తీర్థ సహిత కావేరీ నదీ పుష్కరములు ప్రారంభమగును.

The important days of Hevilambi year

గ్రహణములు

చంద్రగ్రహణము ఈ సం| శ్రావణ శుక్ల పూర్ణిమా సోమవారము 07.08.2017నాడు శ్రవణా నక్షత్రములో మకరరాశిలో చూడామణి నామక అర్గాలగ్రాసకేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించును. ఈ గ్రహణమున పుణ్యముఅధికముగా వచ్చును.

(సంపూర్ణ) చంద్రగ్రహణం

ఈ సం.శుక్ల మాఘ పూర్ణిమా బుధవారము 31-01-2018 నాడు ఆశ్రేషా నక్షత్రములో కర్కాటకరాశిలో రాహుగ్రస్త (సంపూర్ణ) చంద్రగ్రహణం సంభవించును.

శ్రీరామనవమి

ఈ సంవత్సరము 04-04-2017 మంగళవారము నాడు అష్టమి పగలు 11:23 వరకు మరునాడు 05-04-2017 బుధవారము నాడు నవమి పగలు 10:05 వరకు ఉండుటతో మంగళవారము నాడు మాత్రమే నవమికి మధ్యాహ్న వ్యాప్తి కలుగు చున్నది. బుధవారం నాడు నవమికి మధ్యాహ్నస్పర్శ లేనే లేదు. కనుక 04- 04-2017మంగళవారము నాడే నిస్సందేహముగ శ్రీరామనవమి.
ఈ సంవత్సరము అష్టమీ మంగళవారము నాడు అష్టమీ, నవమీ పూజలను రెంటిని చేయవలసి యుండును. ఇదంతా స్మార్త పద్ధతి. వైష్ణవులకు అష్టమీ వేధ పనికిరాదు. మధ్యాహ్న కాలవ్యాప్తి లేకున్నను - అష్టమీ వేధ లేని శుద్ధ నవమియే వారికి గ్రాహ్యము. కనుక 05-04-2017 బుధవారము నాడు వైష్ణవులకు మాత్రమే శ్రీరామనవమి. ఎవరి సంప్రదాయమును వారు అనుసరించుటయే శుభము.

శ్రీకృష్ణ జన్మాష్టమీ, శ్రీకృష్ణ జయనీ

ఈ సంవత్సరము శ్రావణ కృష్ణ సప్తమీ సోమవారము (14-082017) నాడు మాత్రమే అష్టమికి సంపూర్ణ నిశీథ వ్యాప్తి యున్నది. మరునాడు అష్టమి సా. 05:07 వరకు మాత్రమే ఉండుటచే 14-08-2017 సోమవారము నాడే నిస్సందేహముగ శ్రీకృష్ణ జనాష్ణమి అగును.

శ్రావణ కృష్ణాష్టమికి రోహిణీ యోగమును బట్టి శ్రీకృష్ణ జయని నిర్ణయమగును. ఈ అష్టమీ-రోహిణీ యోగము పగలు గాని రాత్రిగాని - ఒక ముహూర్త మాత్రమైనను ఉండవలెను. నిశీధమున (రాత్రి) ముఖ్యము
ఈ సంవత్సరము భాద్రపద కృష్ణాష్టమి బుధవారము (18-09-2017) నాడు వైష్ణవులకు కూడ శ్రీకృష్ణజయని యగును.
ఇలా ఈ సంవత్సరము భాద్రపద కృష్ణాష్టమి బుధవారము 13-9-2017) స్మార్త / వైష్ణవుల కందరకును శ్రీకృష్ణ జయని యగును. అందరకును శుభము. ఒక ముహూర్త మాత్రమైనను ఉండవలెను.

English summary
Astrologer furnishe the details importnant days of Hevalmabi during this Ugadi festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X