నేటినుండి అర్థకేంద్ర యోగంతో ఈ రాశులవారికి మొదలైంది నిజమైన సంక్రాంతి!

జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు, బృహస్పతి రెండు చాలా ముఖ్యమైన గ్రహాలు. ఈ రెండు గ్రహాలు చాలా శక్తివంతమైన గ్రహాలు కావడంతో ఇవి అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేయగలవు. నేడు తెల్లవారుజామున మకర సంక్రాంతి రోజు 5 గంటల 32 నిమిషాలకు కుజుడు, బృహస్పతి ఒకరికొకరు 45 డిగ్రీల కోణంలో ఉండడం వల్ల అర్థ కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నారు.

కుజుడు, బృహస్పతి ఏర్పరిచిన అర్థకేంద్ర యోగం
దీని ప్రభావం మొత్తం అన్ని రాశులపైన కచ్చితంగా ఉంటుంది. అయితే కుజుడు, బృహస్పతి ఏర్పరిచే అర్థకేంద్ర యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మూడు రాశుల వారు కుజుడు, బృహస్పతి కారణంగా భారీ ప్రయోజనాలను పొందుతున్నారు. ఆ మూడు రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

The real Sankranti has begun for these zodiac signs with the Arthakendra Yoga starting today

వృషభ రాశి
నేటినుండి అర్ధకేంద్ర యోగం కారణంగా వృషభ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. వీరు శ్రమకి తగిన ఫలితాలను చూస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబంతో సంతోషంగా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పని విషయంలో కూడా మరింత బాధ్యతగా ప్రవర్తిస్తారు.

కన్యారాశి
కన్యా రాశి వారికి అర్థ కేంద్ర యోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరికి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. విదేశీ పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది.

కుంభరాశి
కుజుడు మరియు బృహస్పతి కారణంగా ఏర్పడే అర్థకేంద్ర యోగం వల్ల కుంభరాశి జాతకులకు కలిసి వస్తుంది. కుంభ రాశి వారు చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. మకర సంక్రాంతి వీరి జాతకాన్ని మార్చేస్తుంది. వ్యాపారం చేసేవారు లాభాలను పొందుతారు. ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. కెరీర్లో గొప్ప అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో మార్పుకు అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. గతం కంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+