జీవితంలో ఆచరించవలసిన అత్యంత ముఖ్యమైన విషయాలు!
డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు - 9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.
హైదరాబాద్: జీవితంలో మనము ఆచరించవలసిన అవసరమైయే అత్యంత ముఖ్యవిషయాలు:
* సూర్యోదయం కంటే ముందు నిద్ర లేచిన వారికి శని బాధలు అంతగా ఇబ్బంది పెట్టవు,పైగా ఆరోగ్యం.
* ఎవరికి ఏ ఆశ పెట్టకు,పెట్టవా తప్పక తీర్చు లేదా నీవు కల్పించిన ఆశ,ఇచ్చిన మాట తాలూకు పాపం జన్మజన్మలకు నిన్ను వదిలి పెట్టదు.
* మనం నివసించే ఇంటికి తప్పక నాలుగు దిశలలో పంచలోహా మత్స్యయంత్రాలు స్థాపింప జేసుకున్న ఇంట్లో వాస్తులోపాలునివారింపబడుతాయి.అందులో నివసించే వారికి అన్ని విధములుగా మేలు చేస్తూ,నరదృష్టి సోకకుండ కాపాడుతుంది.
* గృహప్రవేశ కాలంలో మరియు ఏడాదికి ఒక సారి ఇంట శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతపూజ జరిపించుకునుట మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.
* శని దోషం నడుస్తున్నవారు తన శరీరాన్ని ఎక్కువ సేవాకార్యక్రామాలకు అంకితం చేయాలి. కుటుంబ బాధ్యతల నుండి తప్పించుకోవద్దు.
* రోజు మనకు ఉన్నదానిలో ఎవరికో ఒకరికి కాని,పశు పక్షులకు కాని ఎంతో కొంత ఆహార పదార్ధలు అందించాలి, దానం చేయాలి.

* పుట్టిన రోజు తేదీల ప్రకారం చేసుకోవద్దు. తిథుల ప్రకారం మాత్రమే చేసుకోవాలి.
* పుట్టిన రోజు నాడు పెరుగన్నం (ధధ్యోజనం) వండి దేవినికి నైవేద్య నివేదన చేసి అందరికి పంచాలి. దీని వలన ఆ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా శుభఫలితాలిస్తాయి.
* అనాధలకు,వికలాంగులకు,పేదవారికి మీ శక్తి కొలది వారి వారి అవసారాలను బట్టి సహాయమ్ చేస్తూ ఉంటే నవగ్రహా దోషాలు తొలగుతాయి.మానవ సేవయే మాధవ సేవ అనే సత్యాని తెలుసుకోగలగాలి.
* ఈ సృష్టిలో నీవు ఏది సృష్టించలేదు,ఏది నీది కాదు,ఎమి నీవు తేలేదు, పోయేటపుడు నీవెంట ఏమి తీసుకపోలేవు అనే విషయం ఎప్పుడు మనస్సులో మెదలాడుతూ ఉండాలి.
* గోమాత,తులసి,రావి వృక్షమునకు చేసిన పూజ ఎన్నో రకాలుగా శుభ పలితాలు ఇస్తాయి.
* ప్రతి ఇంట రోజు రెండు పూటల దీపారాధన చేయాలి.వంట నూనే దీపారాధనకు పనికి రాదు.
* చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట,ఒట్టు పెట్టుట చేయకూడదు.
* నిలబడికాని,అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా ఆరోగ్యం క్షీనిస్తుంది.
* నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట,గోళ్ళుకొరుకుట చేయరాదు.
* దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం,పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.
* ఆదివారం, శుక్రవారం, మంగళవారం,రాత్రి సమయాలలో తులసిఆకులు కోయరాదు.
ముఖ్యంగా ఆడవారు కోయకూడదు.
* చీకటి పడ్డాక పువ్వులు,ఆకులు చెట్ల నుండి త్రుంచరాదు.
* గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు.కనుక ఉపదేశం పొందితీరాలి.
* గురువులకు, శ్రమచేసేవారలకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు కష్ట నష్టాల పాలవుతారు.
* శివలింగార్చన స్త్రీలు కూడా చేయవచ్చు.
* ఇంట్లో విగ్రహాలుంటే అవి ఆరు ఇంచులలోపు ఉండే లాగ జాగ్రత్తలు తీసుకోవాలి..
* పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.
* నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి దైవ నామస్మరణ చేయాలి.
* పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.
* హారతి ఇచ్చాక దేవుని పాదలపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.
* తీర్థం తీసుకున్నాక చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకొనరాదు.
* స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు, పూజా మందిరంలో ప్రవేశించరాదు వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.
* ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.
* శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.
* తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయ్యి వేయాలి.
* అన్నం తింటున్న వారెవరినీ,వడ్డించిన వారిని,వండిన వారిని తిట్టరాదు, దెప్పి పొడవరాదు.
* నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.
* ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడితో సమానం వాగ్బంగం చాలా దోషం.
* అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే పాపం.
* విస్తరిలో,కంచంలో మొదట అన్నం వడ్డించ వద్దు.ముందుగా పచ్చడో,కూరగాయలో వడ్డించాకే అన్నం వడ్డించాలి.
* తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.
* గురువునకు ఉపదేశ సమయాలలో కాని పురాణాదులు వినేటప్పుడు సేవలు చేస్తే పాపాలు తొలుగుతాయి.
* మంత్రోపదేశం చేసిన గురు ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు.
* అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.
* ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.
* భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.
* శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా ఎంతో మంచి పుణ్యం వస్తుంది.
* భోజనానికి ముందు కాళ్ళు కడుక్కోవాలి.
తినే పదార్ధాని చేతితోనే తినాలి స్పూన్ సహయంతో తినరాదు.
* పుట్టిన రోజునాడు దీపాలు కానీ కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం.
* తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డును రాసుకోరాదు.
* ఉపవాస వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము.ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.
* చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.
* క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.
* దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.
* దిగంబరంగా నిద్రపోరాదు.
స్నానం చేయరాదు.
* కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.
* విజయ దశమి,శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.
* ఆచమనం చేసిన నీటిని దైవ నివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.
* ప్రతి రోజు ఇంటి ప్రదాన ద్వారం గడప శుభ్రంగా కడిగి బియ్యం పిండి ముగ్గుపెట్టుకోవాలి.
* ఇంటి గుమ్మలపై కూర్చోవటం కాని, కాలు పెట్టడం కాని, తలపెట్టి పడుకోవడం కాని చేయకూడదు.
* దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.
* దీపం కుందీలకు తప్పక కుంకుమ బొట్టు పెట్టాలి.దీపాలు కింద పెట్టకూడదు.
* కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు,తీయకపోతే దోషం లేదు.
* కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.
* కొబ్బరికాయ కొట్టాక కుంకుమ బొట్లు పెట్టకూడదు.
* మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.
* దేవుని పూజలో కొట్టిన కొబ్బర,ప్రసాదాలు అందరికి పంచితేనే పుణ్యం వస్తుంది.
* మనం తినే ఏ పదార్ధం అయిన అక్కడ ఉన్నవారికి కొంత భాగం ఇచ్చి తింటే జీవితంలో నీకు నీ కుటుంబానికి అన్న పానీయాలకు లోటు ఉండదు.
* దీక్షలు అనేవి కచ్చితమైన నియమ నిబంధనలు పాటించే వారే తీసుకొవాలి.సరదాకోసమో,మిత్రులు,బంధువులు,ఆత్మీయులు దీక్ష తీసుకున్నారని తీసుకోకూడదు.
* ఎల్లప్పుడు అందరు నీకంటే గొప్పవారే అనే భావన చెదుతూ,అందరిలో దైవాన్ని చూస్తూ సాత్వీక భావాలతో వ్యహహారించాలి.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!