రెండే రెండు రోజుల్లో వీరి జాతకం మారిపోబోతోంది.. అదృష్టం, డబ్బు
విద్య, సంపద, దాతృత్వం, పుణ్యం, సంతానం, ఆధ్యాత్మికతకు కారకుడు బృహస్పతి. దేవతల గురువైన బృహస్పతి మరో మూడు రోజుల తర్వాత అంటే సెప్టెంబరు 4వ తేదీ సాయంత్రం 4.58 గంటలకు మేషరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. బృహస్పతి డిసెంబర్ 31 వరకు ఇదే స్థితిలో ఉంటాడు. అనంతరం గురుడు ప్రత్యక్ష సంచారం చేస్తాడు. ఈ తిరోగమన చర్యవల్ల నాలుగు రాశులవారిని ఆయన ఆశీర్వదించనున్నారు. వారెవరనేది తెలుసుకుందాం.
మేష రాశి : వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే దాన్నుంచి ప్రయోజనాలను పొందుతారు. అదృష్టం తోడుంటుంది. పొదుపు చేయడంలో విజయవంతమవుతారు. కుటుంబంలో ఉన్న బాధ్యతలను నెరవేరుస్తారు. వ్యాపారం చేసేవారు భారీగా లాభపడతారు. అలాగే ఉద్యోగం చేసేవారికి ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ వస్తుంది. విదేశాల్లో చదవాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇది మంచి సమయం.

సింహ రాశి : సంచార జాతకంలో తొమ్మిదో ఇంట్లో వ్యతిరేక దిశలో కదలబోతున్నాడు. దీనివల్ల వీరికి అదృష్టం తోడుంటుంది. వేతనం పెరగడంతోపాటు ప్రమోషన్ వస్తుంది. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేయడంతోపాటు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. అయితే దేనిలోనైనా పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ సమయం బాగా కలిసి రానుంది. కుటుంబంలో లేదంటే మతపరమైన కొన్ని శుభకార్యక్రమాలు జరుగుతాయి.
తుల రాశి : వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. అవివాహితులకు వివాహ అవకాశాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం దక్కుతుంది. దీనివల్ల ధైర్యం పెరుగుతుంది. భాగస్వామిగా ఉన్న పనిలో విజయవంతమవుతారు.
కుంభ రాశి : డబ్బు దుబారా చేయడం మానుకోవాలి. పసుపు రంగు దుస్తులు ధరించడం మేలు చేస్తుంది. పెళ్లికానివారికి వివాహ అవకాశాలు తలుపు తడతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరు కూడా భాగస్వాములుగా ఉన్న పనిలో విజయం సాధిస్తారు.












Click it and Unblock the Notifications