ఈ రాశులవారికి ఆగస్టు 18 చాలా కీలకం
జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడిని గ్రహాలకు కమాండర్ గా వ్యవహరిస్తారు. జాతకునికి ధైర్యాన్నిచ్చే కుజుడు ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 3.14 గంటలకు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అక్టోబరు 3 వరకు అదే రాశిలో ఉంటాడు. మార్స్ సంచారం వల్ల మూడు రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవేంటో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి:వృశ్చిక రాశి పదకొండో ఇంట్లో మార్స్ సంచరించనున్నాడు. ఏదైనా భూమిని కొనుగోలు చేయడం లేదంటే ఆస్తిని కొనుగోలు చేయడం జరుగుతుంది. చేపట్టే ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. రుణాల నుంచి విముక్తులవుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబంతో గడపడానికి సమయం కేటాయిస్తారు.

మేషరాశి:మేషరాశి ఆరో ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. దీనివల్ల ఈ రాశివారు అనేక ప్రయోజనాలను పొందనున్నారు. ప్రధానంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు వారి విధుల్లో మంచి పురోగతి ఉంటుంది. శత్రువులపై విజయం సాధించడంతోపాటు కోర్టు కేసుల్లోను గెలుపొందుతారు. భూమికి సంబంధించిన వివాదాలుంటే అవి పరిష్కరామవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఆర్థికంగా బలపడతారు.
కర్కాటక రాశి:కర్కాటక రాశి మూడో ఇంట్లో అంగారకుడు సంచరించబోతున్నాడు. దీనివల్ల వీరి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఈ సమయంలో ప్రయాణాలు చేయకుండా ఉండటమే ఉత్తమం. కెరీర్ ఉజ్వలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకు భారీగా లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామి సలహా, సంప్రదింపులతో చేసిన పని విజయాన్నిస్తుంది.












Click it and Unblock the Notifications