సింహరాశిలో శుక్రుడి తిరోగమనం.. వీరు జాక్ పాట్ కొట్టినట్లే
శుక్రుడు రేపు సింహరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి మంచిరోజులు ప్రారంభం కాబోతున్నాయి. ఎవరు ఎలాంటి పనులు చేస్తే జాక్ పాట్ కొట్టినంత అదృష్టమో తెలుసుకుందాం.
వృషభ రాశి : శుక్రుడి తిరోగమనం ఈ రాశివారికి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు మంచి సమయం. పై చదువులకు విదేశాలకు వెళతారు. పరిశోధన రంగంలో పనిచేసేవారు కూడా విదేశాలకు వెళ్లే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులు తమ బాస్ వల్ల మంచి గుర్తింపు సాధిస్తారు. మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఖర్చులు తగ్గుతాయి.శుక్రుడు తిరుగమనం కారణంగా వృషభ రాశి వారికి ప్రశాంత లభిస్తుంది. అంతేకాకుండా వీరు కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి.

కర్కాటక రాశి : కర్కాటక రాశివారి ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. తల్లిదండ్రుల నుంచి భారీగా ఆస్తులను పొందుతారు. కళారంగంలో, సంగీత రంగంలో పనిచేసేవారికి ఇది చాలా మంచి సమయం. కష్టపడి పనిచేసినవారికి సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఉద్యోగస్తులు పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతారు. పిల్లల నుంచి తల్లిదండ్రులు శుభవార్తను వింటారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది.
వృశ్చిక రాశి : శుక్రుడి తిరోగమనం ఈ రాశివారికి ఊహించని అదృష్టాన్ని తెస్తోంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుతారు. కంపెనీ మారేందుకు సన్నాహాలు చేస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు అధికారుల సహకారం లభిస్తుండటంతో రెట్టింపు ఉత్సహంతో పనులు పూర్తిచేస్తారు. మానసికంగా ప్రశాంతత చేకూరుతుంది. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది. శుక్రుడి తిరోగమనం ఒకరకంగా వీరికి జాక్ పాట్ లాంటిది.












Click it and Unblock the Notifications