మత్స్యయోగం, విష్ణుయోగం... ఈ రాశులవారికి భారీ ప్రయోజనాలు
కుజుడు ఆగస్టు 18వ తేదీ వరకు సింహరాశిలో ఉంటాడు. తర్వాత కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మత్స్య యోగంతోపాటు విష్ణుయోగం ఏర్పడుతోంది. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటున్నప్పటికీ కొన్ని రాశులవారు మాత్రం ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. ఊహించని లాభాలుంటాయి. శని, అంగారకుడు, రాహు కూడా కలుస్తాయి. దీనివల్ల ప్రత్యేక ప్రయోజనాలు పొందే రాశులవారి వివరాలు తెలుసుకుందాం.
మేష రాశి: వ్యాపారాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. పెట్టుబడులు పెట్టడంవల్ల భారీస్థాయిలో లాభాలను ఆర్జిస్తారు. అకస్మాత్తుగా ధనలాభం ఉంటుంది. అయితే అనేకరకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ డబ్బులు ఖర్చుచేయాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఎటువంటి పని తలపెట్టినా సులభంగా విజయం సాధిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రత్యర్థులపై విజయం సాధించడమే కాకుండా ప్రమోషన్స్ కూడా పొందుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

ధనుస్సు రాశి: మత్స్య యోగం, విష్ణుయోగంవల్ల చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారి నిరీక్షణ ఫలిస్తుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. వారసత్వంగా వచ్చిన ఆస్తులకు సంబంధించిన వివాదాలు కొనసాగుతుంటే అవి పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులకు లాభాలున్నాయి.
సింహ రాశి: ప్రత్యేక యోగాలవల్ల సింహరాశివారికి బాగా కలిసివస్తుంది. కొత్తగా ఆస్తులుకానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వస్తాయి. అలాగే వీరికి ఊహించనిరీతిలో లాభాలుంటాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.












Click it and Unblock the Notifications