రేపు, ఎల్లుండు నీచంలో చంద్రుడు.. ఈ రెండురోజులే కీలకం
ఈ నెల 28, 29 తేదీల్లో చంద్రుడు వృశ్చిక రాశిలో నీచపడుతున్నాడు. జ్యోతిష్యంలో వృశ్చిక రాశిని గుంభన స్థానంగా పరిగణిస్తారు. ఇటువంటి స్థానంలో చంద్రుడు ఉంటే ఫలితాలు చెడుగా ఉంటాయి. వాస్తవానికి రెండురోజులే సంచరిస్తున్నప్పటికీ తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు, ఆలోచనల ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. ఈ రెండు రోజుల్లో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ముత్యపు ఉంగరం ధరించడం, దుర్గాదేవిని స్తుించడంవల్ల ఈ నీచ ప్రభావం నుంచి బయటపడవచ్చు. ఏ రాశివారికి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.
మేష రాశి: అష్టమ రాశిలో చంద్రుడు నీచబడటంవల్ల మనసులో ఎంతోకాలం నుంచి దాచుకున్న రహస్యాల్లో ఒక్కటైనా బయటపడే అవకాశం ఉంది. దీనివల్ల మానసికంగా బలహీనపడతారు. అమ్మవైపు బంధువులతో విరోధం రావడానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. పొదుపుగా మాట్లాడటం మంచి చేస్తుంది.

వృషభరాశి: సప్తమ స్థానంలో సంచారం జరుగుతోంది. జీవితంలో పారదర్శకత లోపిస్తుంది. మనసులో దాచుకున్న రహస్యం బయటపడే అవకాశం ఉంది. వ్యసనం అలవాటవుతుంది. అనవసర పరిచయాలుంటాయి. మాట పొదుపుగా వాడుతూ ఎవరితోను వాదోపవాదాలకు దిగకుండా ఉండాలి. ఆలోచించేటప్పుడు రెండువైపులా సమతూకంతో ఆలోచించాలి.
మిథున రాశి: ఎవరికో ఆర్థిక సహాయం చేస్తారు. కానీ అది రహస్యంగా చేస్తారు. మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంది. జూదాల్లో డబ్బు పెట్టి నష్టపోతారు. లేనిపోని సమస్యలను అనవసరంగా నెత్తికెక్కించుకుంటారు. అమ్మతరఫు బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. మాట్లాడే మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications