ఈ రాశులవారు 25 నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే..
బుధుడు ఈనెల 25వ తేదీ ఉదయం 4.26 గంటలకు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మేథస్సుకు, తర్కానికి కారకుడైన బుధుడి సంచారం వల్ల ప్రతి రాశివారు ఎంతో జాగ్రత్తగా ఉండటం అవసరం. దీనివల్ల సంపద, అభివృద్ధి ఉన్నప్పటికీ కొన్ని రాశులవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఆ రాశుల వివరాలు తెలుసుకుందాం.
మేష రాశి : మేషరాశి 5వ ఇంట్లో బుధుడు సంచరించనున్నాడు. దీనివల్ల వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. ఖర్చు పెరుగుతుంది. వ్యాపారస్తులకు వచ్చే లాభం చాలా చాలా తక్కువగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యం కోసం ఎక్కువ డబ్బులు ఖర్చుచేయాల్సి ఉంటుంది. పెద్దల ఆరోగ్యంలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి.

వృషభ రాశి : వృషభరాశి 4వ ఇంట్లో బుధుడు సంచరించనున్నాడు. అంతేకాకుండా 10వ ఇంటిని కూడా పరిశీలిస్తున్నాడు. దీనివల్ల కుటుంబ సమస్యలతోపాటు ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రమోషన్ కోసం ఉద్యోగులు ఎదురుచూడాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు వచ్చే లాభాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. ఏ పనీ చేయకుండా ఉండటమే ఉత్తమం. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి : సింహరాశిలో సంచారం పూర్తయిన తర్వాత బుధుడు కర్కాటక రాశి 2వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల స్థానికులకు స్థానచలనం ఉంటుంది. పనిచేసేచోట ఒత్తిడి ఎక్కువవుతుంది. ఉన్నతాధికారుల నుంచి కూడా ఎటువంటి ప్రోత్సాహం లభించదు. ఓపికతో పనిచేయాలి. వ్యాపారస్తులకు లాభాలు కూడా చాలా తక్కువ. కష్టపడి పనిచేసినప్పటికీ కోరిక మేరకు విజయాన్ని సాధించలేరు.
కన్యా రాశి : సింహరాశిలో సంచారం పూర్తయిన తర్వాత బుధుడు కన్యారాశి 12వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల స్థానికులకు సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు వస్తాయి. ధన నష్టం ఉంటుంది. ప్రయాణం చేయకుండా ఉండటం ఉత్తమం. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలి.












Click it and Unblock the Notifications