గురువు అనుగ్రహంతో 2025 వరకు ఈ రాశులకు తిరుగులేదు

జ్యోతిష్యంలో గురు గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తరుచుగా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే రాశి సంచారం చేస్తుంటుంది. ఈనెల రెండోతేదీన గురువు వృషభరాశిలోకి ప్రవేశించాడు. 2025 మే వరకు అక్కడే కొనసాగుతాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి ఊహించనిరీతిలో ధనలాభం కలగనుంది. అదే సమయంలో మరికొన్ని రాశులవారికి అదృష్టం బాగా కలిసివస్తుంది. వేధిస్తున్న కొన్ని సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారమవుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏ రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

మేష రాశి
ధనానికి సంబంధించిన విషయాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలను ఈ సమయంలో సలువుగా పరిష్కరింపచేసుకుంటారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి.జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. విద్యార్థులకు ఈ సమయం బాగుంది. విదేశీ విద్య చేయాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది.

these zodiac signs are very lucky due to guru graha grace 2024 june

కర్కాటక రాశి
అనుకున్న లాభాలు కలుగుతాయి. కోరికలన్నీ సులభంగా నెరవేరతాయి. ఏ పని తలపెట్టినా అదృష్టం తోడుండి విజయాలు సాధించడంతోపాటు జీవితంలో ఆనందంగా ఉంటారు. శాంతి, సంతోషాలు రెట్టింపు అవుతాయి. కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. అనుకున్న పనులను పూర్తిచేస్తారు.

కన్యా రాశి
వీరికి మంచి లాభాలున్నాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారాలు చేస్తున్నవారికి మంచి లాభాలు వస్తాయి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకున్న పనులు సులభంగా నెరవేరతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధించడంతోపాటు ఊహించనిరీతిలో ధనలాభాన్ని పొందుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+