వృషభరాశిలోకి శుక్రుడు.. ఈ రాశులపై కుబేరుడి అనుగ్రహం
జ్యోతిష్యం ప్రకారం ఈనెల 14వ తేదీన ఆదిత్యుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. 19వ తేదీన శుక్రుడు కూడా ప్రవేశిస్తాడు. దీనివల్ల వృషభరాశిలో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి అదృష్టం పట్టుకుంటుంది. సంపద కూడా బాగా పెరుగుతుంది. కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా గడుస్తుంది. ఏయే రాశులవారికి, ఏ విధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
వృషభం
ఈ రాశివారు సమాజంలో గౌరవ మర్యాదలు పొందడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. కెరీర్ విషయంలో ఇప్పటివరకు ఎదురవుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని దంపతులు చవిచూస్తారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఆర్థికంగా లాభపడే అవకాశాలున్నాయి. నిరుద్యోగులకు ఆఫర్లు వస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఎంత కష్టపడితే అంతగా ఆర్థిక ప్రయోజనాలున్నాయి.

కర్కాటకం
ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులకు మార్గాలు తెరుచుకుంటాయి. కెరీర్ కు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడి ఎంతో లాభదాయకంగా మారుతుంది. పిల్లలకు సంబంధించిన శుభవార్తలను వింటారు. ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలపట్ల ఆసక్తి కలుగుతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
మేషరాశి
ఈ రాశివారికి అంతా శుభప్రదంగా ఉంటుంది. శుక్రదిత్య యోగం సంపద, వాక్కు ఇంటిపై జరగబోతోంది. ఊహించని రీతిలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు లభిస్తాయి. ఎక్కువ మొత్తం సంపాదించే అవకాశాన్ని పొందుతారు. వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటారు. ఈ సమయంలో మీ కోరికలన్నీ నెరవేరతాయి. మీరు మాట్లాడే మాటల ప్రభావం ఎదుటివారిపై బలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.












Click it and Unblock the Notifications