మూల త్రికోణ రాజయోగంతో ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే
గ్రహాల కదలికలను బట్టి మనిషి జీవితం ఆధారపడివుంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి గ్రహాలు సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే బుధుడు ఈనెల 23వ తేదీన కన్యారాశిలోకి అడుగుపెట్టాడు. శుక్రుడు తులారాశిలో, శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తూ మూడు గ్రహాలు ఎదురెదురుగా వచ్చి త్రిభుజ కోణాన్ని ఏర్పరచడంతో మూల త్రికోణ యోగం ఏర్పడింది. దీనివల్ల ఐదు రాశులవారు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశివారికి సంపద పెరుగుతుంది. వ్యాపారం చేయాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. వ్యాపారం వల్ల సమాజంలో గుర్తింపు పొందుతారు. అన్నదమ్ముల మధ్య అనుబంధం బలంగా ఉంటుంది. కోరుకున్న కోరికలు నెరవేరతాయి. కాకపోతే ధైర్యంగా ప్రయత్నించాలి.

కన్యారాశి
కొంతకాలం నుంచి వస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ధన నష్టం తగ్గుతుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటివరకు చూడని లాభాన్ని కళ్ల చూస్తారు. మంచి ఫలితాలను సాధిస్తారు. పారిశ్రామికవేత్తలుగా ఉన్నవారికి ఈ సమయంలో మంచి లాభాలున్నాయి.
తులారాశి
ఉద్యోగం చేసేచోట మిమ్మల్ని వ్యతిరేకించినవారే తిరిగి మీ దగ్గరకు వస్తారు. మంచి ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారస్తులు మంచి వృద్ధిలోకి వస్తారు. విభిన్నంగా ఆలోచించి వాటిని అమలు చేయడంవల్ల విజయం దిశగా సాగుతారు.
కుంభ రాశి
కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తుల నుంచి ఆర్థిక లాభాలుంటాయి. చేస్తున్న పని నుంచి స్ఫూర్తిని పొందుతారు. ఎంత శ్రమ పడితే అంత డబ్బు పొందుతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారి మధ్య అనుబంధం బలపడుతుంది.
మీన రాశి
కుటుంబంలో వస్తున్న వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఎప్పటినుంచో పూర్తిచేయాలనుకుంటున్న పనిని పూర్తిచేస్తారు. మిమ్మల్ని వద్దనుకున్నవారు తిరిగి మీ దగ్గరకు వస్తారు. ఉద్యోగంలో పై అధికారుల నుంచి, తోటి ఉద్యోగుల నుంచి సహకారం అందుతుంది.












Click it and Unblock the Notifications