2025 ఫిబ్రవరి తరువాత వీరికి అఖండ ధనయోగం ఉందన్న బాబా వంగా!
2025 సంవత్సరం ఫిబ్రవరి నెల తర్వాత గ్రహాల గమనం కారణంగా ద్వాదశ రాశుల వారి జాతకాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే 2025 సంవత్సరంలో ఫిబ్రవరి తర్వాత నుండి ఏ రాశుల వారి పంట పండుతుంది. నక్కతోక తొక్కే రాశులు ఏమిటి? అనేది ప్రపంచంలోని ప్రసిద్ధ జ్యోతిష్య నిపుణులు బాబా వంగా తన అంచనాలలో ఎప్పుడో వెల్లడించారు.
2025 అదృష్టరాశులు... బాబా వంగా ప్రిడిక్షన్
1966లో బాబా వంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పటికీ బాబా వంగా జ్యోతిష్య శాస్త్ర అంచనాలు నేటికి చాలామంది బలంగా నమ్ముతారు. చాలా వరకు ఆమె ప్రిడిక్షన్ నిజమైంది. బాబా వంగా తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే చెప్పారు. ఈ క్రమంలో 2025లో ఫిబ్రవరి నెల తర్వాత ఏ రాశివారు అదృష్టవంతులు కాబోతున్నారో కూడా చెప్పారు.

మేషరాశి
బాబా వంగా జ్యోతిష్య అంచనాల ప్రకారం మేషరాశి వారికి 2025 సంవత్సరంలో ముఖ్యంగా ఫిబ్రవరి నెల తర్వాత గొప్ప విజయాలు రాబోతున్నాయి . ఈ ఏడాది మేషరాశి వారికి కష్టానికి తగిన ఫలితం తప్పక వస్తుంది. డబ్బు సంపాదించడానికి గొప్ప అవకాశాలు వస్తాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మేషరాశి వారి ఆర్ధిక స్థితి బాగానే ఉంటుంది. . 2025సంవత్సరం వీరికి సంపదను, పురోగతిని ఇస్తుందని బాబా వంగా పేర్కొన్నారు. మేషరాశి జాతకులు ఈ ఏడాది ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు
వృషభ రాశి
బాబా వంగా 2025లో ఫిబ్రవరి తర్వాత వృషభ రాశి వారు ఆర్ధికంగా స్థిరంగా ఉంటారని తెలిపారు. బాబా వంగా అంచనా ప్రకారం వృషభ రాశి వారికి ఇది అదృష్ట సంవత్సరం. 2025లో తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారని, ఆర్థికంగా ఈ సమయాల్లో బలోపేతం అవుతారని బాబా వంగా జ్యోతిష్య అంచనాలో వెల్లడించారు. వర్తక, వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగాలు చేసే వారికి విజయాలు వరిస్తాయని బాబా వంగా తెలిపారు.
కర్కాటక రాశి
బాబా వంగా 2025 సంవత్సరం కర్కాటక రాశి వారికి శుభాలను చేకూర్చే సంవత్సరం అని తెలిపారు. ముఖ్యంగా ఫిబ్రవరి తర్వాత వీరికి కలిసి వస్తుందన్నారు. కర్కాటక రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి కూడా అద్భుతమైన సమయం ఇది అని పేర్కొన్నారు. ఆర్థికంగా ఈ సమయంలో బాగుంటుంది అని తెలిపారు. ఈ సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయని, కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది సరైన సమయం అన్నారు.
సింహ రాశి
2025 సంవత్సరంలో ఫిబ్రవరి తర్వాత సింహ రాశి వారు శుభ ఫలితాలను చూస్తారని బాబా వంగా పేర్కొన్నారు. ఈ సమయంలో సింహ రాశి వారికి ధనప్రాప్తితో జీవితం బాగా మారుతుందన్నారు. గ్రహాల సానుకూల స్థానం కారణంగా డబ్బులు సంపాదించడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయని వెల్లడించారు. ఇది సింహరాశి వారికి అదృష్ట సంవత్సరంగా బాబా వంగా తెలిపారు.
కుంభరాశి
2025 లో ఫిబ్రవరి తర్వాత కుంభ రాశి వారు జీవితంలో విజయాలు సాధిస్తారని తెలిపారు. అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించగలుగుతారని, ఈ సంవత్సరం ఆర్థికపరమైన, వృత్తిపరమైన రంగాలలో గొప్ప ప్రయోజనాలను పొందుతారని పేర్కొన్నారు. శని కారణంగా కుంభరాశి వారిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం బాగా పెరుగుతాయని తెలిపారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications